ఎంత పని సేశావురా..? | Suicide by drinking pesticide | Sakshi
Sakshi News home page

ఎంత పని సేశావురా..?

Published Tue, Feb 17 2015 2:25 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

ఎంత పని సేశావురా..? - Sakshi

ఎంత పని సేశావురా..?

ఆర్థిక భారంతో ఎంటెక్ చదవలేక గాండ్లపెంట మండలం కత్తివారిపల్లికి చెందిన ఇంజనీరింగ్ (సివిల్) పట్టభద్రుడు పాళ్యం జయచంద్రారెడ్డి(22) ఆదివారం రాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘ఉద్యోగం రాకపోతే ఏదో ఒక పని సేసుకుని బతికేటోళ్లం. పెద్ద సదువు సదవ లేదని మాకు అన్యాలం సేసి పోయినావురా.. సెట్టంట ఎదిగాడని సంబరపడితే ఇట్టెందుకు సేత్తివిరా..’ అంటూ తల్లి శివమ్మ, బంధువులు గుండెలవిసేలా రోదించారు.

తెలివైన విద్యార్థి ఇలా తనువు చాలించడంపై గ్రామస్తులు కంట నీరు పెట్టారు. తండ్రి పాళ్యం వెంకటరమణారెడ్డి తనకున్న మూడున్నర ఎకరాల పొలంతో బతుకు బండిని భారంగా లాగిస్తుండగా.. చేతికొచ్చిన కొడుకు ఇలా బలవన్మరణానికి పాల్పడటం అందరినీ కలచివేసింది. సోదరి రాజేశ్వరి వివాహ నిశ్చితార్థంతో సోమవారం కళకళలాడాల్సిన ఇల్లు రోదనలతో దద్దరిల్లింది.                           
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement