Jayachandra Reddy
-
తంబళ్లపల్లెలో టీడీపీ అస్త్ర సన్యాసం!
బి.కొత్తకోట: ఏ ఎన్నికై నా బరిలో నిలిచే అభ్యర్థి, ఆ పార్టీ యంత్రాంగం విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతారు, విజయమో, వీరస్వర్గమో అన్నంతగా ప్రత్యర్థులతో తలపడతారు. అయితే ప్రస్తుతం తంబళ్లపల్లెలో టీడీపీ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. టీడీపీ చరిత్రలో ఎన్నడూ చూడని దయనీయమైన ప్రస్తుత పరిస్థితిని పార్టీ క్యాడర్ జీర్ణించుకోలేక పోతోంది. వైఎస్సార్సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డితో తలపడే స్థితిలో లేని టీడీపీ ఓటింగ్‌కు ముందే అస్త్ర సన్యాసం చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎక్కడా ప్రచార ఆర్భాటాలు లేవు, ఎన్నికల్లో తమ అభ్యర్థికి ఓటు వేయమన్న అభ్యర్థనలు లేవు. సోమవారం ఓటింగ్ జరగనుండగా అందుకు తగ్గట్టుగా ఏర్పాట్ల కోసం క్యాడర్ పని చేయడమూ లేదు. దీనితో ఓటింగ్‌కు ముందే టీడీపీ ఓటమి పాలైందా అన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లోనే జోరుగా సాగుతోంది.అభ్యర్థి ఎవరో తెలియదుటీడీపీ అభ్యర్థుల తొలి జాబితాలోనే తంబళ్లపల్లె అభ్యర్థిగా జయచంద్రారెడ్డి పేరును చంద్రబాబు ఫిబ్రవరి 24న ప్రకటించారు. రాజకీయాలకు, టీడీపీకి కొత్త అయిన అయన్ను చూడాలని పల్లెల్లోని ఓటర్లు ఎదురుచూశారు. ఆరు మండలాల్లో 1,200లకుపైగా పల్లెలు ఉన్నాయి. ఎన్నికల ప్రచారం చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ప్రతిపల్లెకు తారురోడ్లు నిర్మించారు. అయినప్పటికి ఇందులో సగం పల్లెల్లోనైనా టీడీపీ అభ్యర్థి ప్రచారం జరగలేదు. ప్రచారానికి వెళ్లినా కొద్దిసేపటికే ముగిస్తారు. దీంతో నియోజకవర్గ ప్రజలకు టీడీపి అభ్యర్థి ఎవరో తెలియని పరిస్థితి. ఓటర్లతో కనీస పరిచయాలు లేకపోవడం, తన సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇవ్వడం మిగతా కులాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వారం–పదిరోజులుగా టీడీపీ ప్రచారమే కనిపించడం లేదు. ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గం మొదట్లో జయచంద్రారెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించినా ఆ తర్వాత ఆయనకు దగ్గరయ్యారు. కానీ శంకర్ వర్గాన్ని గుర్తించకపోవడంతో అభ్యర్థి తీరుపై అసంతృప్తితో వారు దూరమయ్యారు.అయిష్టంగానే కిరణ్టీడీపీ అభ్యర్థిగా జయచంద్రారెడ్డిని మార్చేవరకు తంబళ్లపల్లెలో అడుగుపెట్టను అని చెప్పిన బీజేపీ ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి చివరకు సర్దుకుపోయారు. నియోజకవర్గ పర్యటనల్లో జయచంద్రారెడ్డితో కలిసి కిరణ్ అయిష్టంగానే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీనికితోడు కిరణ్ వర్గీయుల ప్రచారంలో ఎంపీ అభ్యర్థికి మాత్రమే ఓట్లు వేయాలని కోరుతుండటం గమనార్హం.చంద్రబాబు హెచ్చరించినాటీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డిని చంద్రబాబు రెండుసార్లు హెచ్చరించినా ఆర్థిక వనరులను సమకూర్చుకునే విషయంలో చేతులెత్తేసినట్టు తెలిసింది. దీంతో చంద్రబాబు కూడా తంబళ్లపల్లెలో టీడీపీ గెలుపు అవకాశాలపై ఆశలు వదులుకున్నట్లు స్పష్టమవుతోంది.ఎన్నికలకు క్యాడర్ దూరంసోమవారం జరిగే ఎన్నికలకు మెజారిటీ టిడీపీ క్యాడర్ దూరంగా ఉంటోంది. గెలుపునకు పనిచేయాలని అభ్యర్థి జయచంద్రారెడ్డి నుంచి పిలుపు లేకపోవడంతో ముఖ్యమైన నేతలు, మండలస్థాయి నాయకులు నిస్తేజంగా ఉండిపోయారు. ఎన్నికల్లో పనిచేసేందుకు కనీస ఖర్చులు భరించకుంటే ఓటర్లను కలిసి ఎలా ఓట్లు అడుగుతామని అంటున్నారు. -
జస్టిస్ జయచంద్రారెడ్డి మృతిపై సీఎం జగన్ దిగ్ర్భాంతి
సాక్షి, తాడేపల్లి : సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కామిరెడ్డి జయచంద్రారెడ్డి మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. లా కమిషన్ చైర్మన్‌గా, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా భారత న్యాయవ్యవస్థకు ఆయన చేసిన కృషి మరువలేనిదని సీఎం వైఎస్ జగన్ గుర్తుచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. Deeply saddened by the demise of luminary Justice (Retd) K. Jayachandra Reddy. His contribution towards the Indian Judiciary System as the Head of Law Commission & Press Council of India was noteworthy. My thoughts & prayers are with his bereaved family. — YS Jagan Mohan Reddy (@ysjagan) February 10, 2020 పదవీ విరమణ అనంతరం బెంగళూరులో ఉంటున్న జస్టిస్ జయచంద్రారెడ్డి ఆదివారం సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. తన కుమారుడు చనిపోవడంతో కోడలు, మనవళ్లతో బెంగళూరులో విశ్రాంత జీవితం గడుపుతున్న జస్టిస్ జయచంద్రారెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చదవండి : కుగ్రామం నుంచి సుప్రీం స్థాయికి.. జస్టిస్ జయచంద్రారెడ్డి కన్నుమూత -
జేసీ బదర్స్ ముఠా అరాచకాలు తారస్థాయికి చేరాయి
-
టీడీపీ నుంచి మరో నేత సస్పెన్షన్
అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరో నాయకుడు ఆ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు తాడిపత్రి టీడీపీ కౌన్సిలర్ జయచంద్రారెడ్డిపై వేటు వేశారు. ఆయనపై మూడు నెలల పాటు సస్పెన్షన్ విధించారు. తాడిపత్రి మున్సిపాలిటీలో జేసీ ప్రభాకర్‌రెడ్డి అవినీతికి పాల్పడ్డారని ఇటీవల జయచంద్రారెడ్డి ఆరోపణలు చేశారు. దీనిపై జేసీకి క్షమాపణ చెప్పాలని పార్టీ ఆదేశించినా ఆయన పట్టించుకోలేదు. తాను చేసిన ఆరోపణలను కట్టుబడి క్షమాపణ చెప్పేందుకు ఆయన నిరాకరించారు. దీంతో టీడీపీ ఆయనపై చర్య తీసుకుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేను వదిలేసి కౌన్సిలర్‌ను సస్పెండ్ చేయడాన్ని తాడిపత్రి ప్రజలు తప్పుబడుతున్నారు. భూకబ్జా కేసులో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడంతో జేసీ అల్లుడు, ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిని టీడీపీ ఇటీవల బహిష్కరించింది. బ్యాంకులకు డబ్బులు ఎగవేశారని ఆరోపణలు రావడంతో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని అంతకుముందు టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. -
జంట హత్యతో కలకలం
వివాహేతర సంబంధమే కారణం ఆటోడ్రైవర్, అతని స్నేహితుడు హత్య బుక్కచెర్ల గ్రామంలో విషాద ఛాయలు జంట హత్యలతో ‘అనంత’ ఉలిక్కిపడింది. అనంతపురం రూరల్ మండలం రుద్రంపేట సమీపంలో గోపీనాయక్, వెంకటేశ్నాయక్ల హత్యను మరువకనే ఇదే మండలం కక్కలపల్లి గ్రామ సమీపంలో మరో జంట హత్య వెలుగు చూడటం కలకలం రేపింది. తాజాగా జరిగిన హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తెలిసింది. అనంతపురం సెంట్రల్ : వివాహేతర సంబంధం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. పోలీసులు, గ్రామస్తుల కథనం మేరకు... రాప్తాడు మండలం బుక్కచెర్ల గ్రామానికి చెందిన నారాయణరెడ్డి కుమారుడు జయచంద్రారెడ్డి (22) ఆటో డ్రైవర్. ఇతను గ్రామంలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం ఆమె బంధువులకు తెలియడంతో కొంత కాలం క్రితం గొడవ జరిగింది. పద్ధతి మార్చుకోవాలని జయచంద్రారెడ్డిని పలుమార్లు హెచ్చరించారు. అయినా మార్పు రాకపోవడంతో విసిగిపోయిన మహిళ బంధువులు జయచంద్రారెడ్డిని ఎలాగైనా మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నారు. అదును చూసి.. అంతమొందించారు.. జయచంద్రారెడ్డి అక్క కుమారుడికి గురువారం సాయంత్రం కుక్క కరిచింది. కుటుంబ సభ్యులతో కలిసి బాలుడిని తీసుకుని రాత్రి 9.30గంటలకు అనంతపురం సర్వజనాసుపత్రికి తన ఆటోలో తీసుకొచ్చాడు. అక్కడ అడ్మిషన్ చేయించిన అనంతరం అదే రోజు రాత్రి తన స్నేహితుడు అశోక్‌కుమార్‌రెడ్డి(22)తో కలిసి స్వగ్రామానికి బయల్దేరాడు. అప్పటికే కాపు కాచిన మహిళ బంధువులు ఆటోను అటకాయించారు. మార్గమధ్యంలో ఇద్దరిపై దాడి చేసి, తాడులతో గొంతు బిగించి హతమార్చారు. అనంతరం అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి గ్రామ సమీపంలో రోడ్డుపక్కన పడేసి వెళ్లిపోయారు. జయచంద్రారెడ్డి–అశోక్‌కుమార్‌రెడ్డి మృతితో బుక్కచెర్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు జంట హత్యలు జరిగిన విషయం వెలుగులోకి రావడంతో అనంతపురం రూరల్ సీఐ కృష్ణమోహన్, ఎస్ఐలు జగదీష్, నాగేంద్రప్రసాద్‌లు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న ఆటోను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. మృతుల బంధువులు ఫిర్యాదు మేరకు రాప్తాడు మండలం కొత్తపల్లికి చెందిన మహిళ సోదరుడు సోమనాథ్యాదవ్పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
ఎంత పని సేశావురా..?
ఆర్థిక భారంతో ఎంటెక్ చదవలేక గాండ్లపెంట మండలం కత్తివారిపల్లికి చెందిన ఇంజనీరింగ్ (సివిల్) పట్టభద్రుడు పాళ్యం జయచంద్రారెడ్డి(22) ఆదివారం రాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘ఉద్యోగం రాకపోతే ఏదో ఒక పని సేసుకుని బతికేటోళ్లం. పెద్ద సదువు సదవ లేదని మాకు అన్యాలం సేసి పోయినావురా.. సెట్టంట ఎదిగాడని సంబరపడితే ఇట్టెందుకు సేత్తివిరా..’ అంటూ తల్లి శివమ్మ, బంధువులు గుండెలవిసేలా రోదించారు. తెలివైన విద్యార్థి ఇలా తనువు చాలించడంపై గ్రామస్తులు కంట నీరు పెట్టారు. తండ్రి పాళ్యం వెంకటరమణారెడ్డి తనకున్న మూడున్నర ఎకరాల పొలంతో బతుకు బండిని భారంగా లాగిస్తుండగా.. చేతికొచ్చిన కొడుకు ఇలా బలవన్మరణానికి పాల్పడటం అందరినీ కలచివేసింది. సోదరి రాజేశ్వరి వివాహ నిశ్చితార్థంతో సోమవారం కళకళలాడాల్సిన ఇల్లు రోదనలతో దద్దరిల్లింది.