సాక్షి, తాడేపల్లి : సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కామిరెడ్డి జయచంద్రారెడ్డి మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. లా కమిషన్ చైర్మన్‌గా, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా భారత న్యాయవ్యవస్థకు ఆయన చేసిన కృషి మరువలేనిదని సీఎం వైఎస్ జగన్ గుర్తుచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Deeply saddened by the demise of luminary Justice (Retd) K. Jayachandra Reddy. His contribution towards the Indian Judiciary System as the Head of Law Commission & Press Council of India was noteworthy. My thoughts & prayers are with his bereaved family.
— YS Jagan Mohan Reddy (@ysjagan) February 10, 2020
పదవీ విరమణ అనంతరం బెంగళూరులో ఉంటున్న జస్టిస్ జయచంద్రారెడ్డి ఆదివారం సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. తన కుమారుడు చనిపోవడంతో కోడలు, మనవళ్లతో బెంగళూరులో విశ్రాంత జీవితం గడుపుతున్న జస్టిస్ జయచంద్రారెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
చదవండి : కుగ్రామం నుంచి సుప్రీం స్థాయికి..
Comments
Please login to add a commentAdd a comment