న్యూఢిల్లీ : హెచ్‌ఎండీ గ్లోబల్ మరో కొత్త నోకియా ఫోన్లను భారత్‌లో లాంచ్ చేసింది. ఒకటి స్మార్ట్‌ఫోన్ కాగా, మరొకటి ఫీచర్ ఫోన్. ఈ రెండింటిన్నీ ఫిబ్రవరిలో జరిగిన 2018 ఎండబ్ల్యూసీలోనే హెచ్‌ఎండీ గ్లోబల్ ప్రకటించింది. నోకియా 3.1 ప్లస్, నోకియా 8110 4జీ ‘బనానా ఫోన్’ పేర్లతో వీటిని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. నోకియా 3.1 ప్లస్ 3జీబీ ర్యామ్+32జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.11,499. ఈ స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 19న ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉండనుంది. ఎయిర్‌టెల్ కస్టమర్లు నోకియా 3.1 ప్లస్ స్మార్ట్‌ఫోన్ కొంటే 1టీబీ డేటా లభ్యం కానుంది. ఇక నోకియా 8110 4జీ ఫీచర్ ఫోన్‌ను రూ.5,999కు లాంచ్ చేసింది. ఈ బనానా ఫోన్ అక్టోబర్ 24 నుంచి అందుబాటులోకి రానుంది. నోకియా 3.1 ప్లస్ స్మార్ట్‌ఫోన్ బ్లూ, బాల్టిక్, వైట్ రంగుల్లో అలరించనుంది.
నోకియా 3.1 ప్లస్ స్పెషిఫికేషన్లు...
6 అంగుళాల ఫుల్ స్క్రీన్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
పైన, కింద సిమెంట్రికల్ బెజెల్స్
వెనుక ప్యానల్‌కు మెటల్ మాదిరి ఫినిస్, ఇది హెచ్‌ఎండీ తన ఖరీదైన ప్లస్ ఫోన్లకు అందిస్తోంది
మీడియాటెక్ హిలియో పీ22 చిప్‌సెట్
3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
400జీబీ వరకు విస్తరణ మెమరీ
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
13ఎంపీ + 5ఎంపీ ప్రైమరీ సెన్సార్
8ఎంపీ ఫ్రంట్ కెమెరా
3500 ఎంఏహెచ్ బ్యాటరీ
నోకియా 8110 4జీ స్పెషిఫికేషన్లు...
ట్రెడిషినల్ బ్లాక్, బనానా యెల్లో రంగుల్లో అందుబాటు
కైఓఎస్ ఆధారిత స్మార్ట్ ఫీచర్ ఓఎస్‌తో రన్ అవుతుంది
2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే
వెనుక వైపు 2 మెగాపిక్సెల్ కెమెరా
క్వాల్‌కామ్ 205
గూగుల్ మ్యాప్స్, గూగుల్ అసిస్టెంట్, ఫేస్‌బుక్ వంటి ముఖ్యమైన యాప్స్ యాక్సస్
వైఫై హాట్‌స్పాట్ ను కూడా ఇస్తోంది
Comments
Please login to add a commentAdd a comment