సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ మొబైల్స్ తయారీదారు డీటెల్ కొత్తఫీచర్ ఫోన్ లాంచ్ చేసింది. 'డి 1 స్లిమ్' పేరుతో అతి తక్కువ ధరలో ఒక ఫీచర్‌ఫోన్‌ను సోమవారం విడుదల చేసింది. డీ1కు సక్సెసర్‌గా తీసుకొచ్చిన ఈ ఫీచర్ ఫోన్‌లో డిజిటల్ కెమెరా విత్‌ఎల్‌ఈడీ ఫ్లాష్ ప్రత్యేకతగా కంపెనీ చెబుతోంది. అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, డిజైన్‌తో డీ1స్లిమ్ ఫీచర్ ఫోన్ మార్కెట్‌లో కొత్త ఒరవడిని సృష్టించనుందని డీటెల్ ఎండీ యోగేష్ భాటియా తెలిపారు. బీటుబీ అడ్డా వెబ్‌సైట్‌లో ఈఫోన్ లభించనుంది.
గతంలో రూ. 299లకే డీ1 ఫీచర్‌ఫోన్ తీసుకొచ్చిన కంపెనీ భారతదేశంలో అతి తక్కువ విలువైన మొబైల్ ఫోన్ తమదే అని కంపెనీ పేర్కొంది. బ్లూ, గోల్డ్, పింక్ - మూడు కలర్ వేరియంట్లలో లభించనుంది. 2.8 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే, మైక్రోఎస్డీ కార్డు ద్వారా 16 జీబికి స్టోరేజ్ విస్తరణ, 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీవిస్తరించగల సామర్ధ్యం ఈ ఫోన్‌లో జోడించింది. ఈ ఫీచర్ ఫోన్ ధర 1199 రూపాయలు.
Comments
Please login to add a commentAdd a comment