Detel phone
-
ప్రపంచంలోనే అతి చౌక బైక్ ఇదే..ధర వింటే
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత సరసమైన ఫీచర్ ఫోన్, టీవీని తీసుకొచ్చిన ఎలక్ట్రానిక్ బ్రాండ్ డీటెల్ సంస్థ తాజాగా మరో ఆవిష్కరానికి నాంది పలికింది. ప్రపంచంలోని చౌకైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని లాంచ్ చేసింది. డీటెల్ ఈజీ పేరుతో కేవలం 19,999 (జీఎస్టీ అదనం) రూపాయలకు విడుదల చేసింది. ఎలక్ట్రిక్ బైక్ ఫీచర్లు 48 వాట్ల 12ఏహెచ్ ఎల్ఐఎఫ్ఈపీవో 4 బ్యాటరీని ఈ వాహనంలో అమర్చింది. దీన్ని పూర్తిగా చార్జింగ్ చేసేందుకు 7 నుంచి 8 గంటల సమయం పడుతుంది. ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 60 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. 6 పైప్ కంట్రోలర్‌తో కూడిన 250 వాట్ల ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేస్తుంది, బైక్ గంటకు గరిష్టంగా 25 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేదు. కాలుష్య ఉద్గారాలను నిరోధించే క్రమంలో, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం లభిస్తున్న తరుణంలో ఎలక్ట్రిక్ బైక్‌ను తీసుకొచ్చినట్టు డిటెల్ కంపెనీ వ్యవస్థాపక సీఈవో యోగేష్ భాటియా తెలిపారు. పర్యావరణం పట్ల పెరుగుతున్న అవగాహన, పెట్రోల్ ధరలు పెరగడం, కఠినమైన ఉద్గార నిబంధనలు వంటి వివిధ అంశాల కారణంగా భారతదేశంలో ఈవీ పరిశ్రమ అభివృద్ధి చెందుతోందన్నారు. రానున్న రోజుల్లో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంటుందని అన్నారు. ఇప్పటికే ఎంతో మంది ఈ వాహనాలను వాడేందుకు ఆసక్తిని చూపిస్తున్నారని అలాగే ఆ వాహనాల కొనుగోలుపై సబ్సిడీని కూడా లభిస్తోందని చెప్పారు.నిత్యం తక్కువ దూరంప్రయాణించేవారికి ఈ బైక్ ఉపయోగపడుతుందని తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీసుకొచ్చిన 'ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ' ద్వారా, విద్యుత్ వాహనాల వినియోగం గతంలో కంటే ఇప్పుడు పెరుగుతుందని భాటియా చెప్పారు.ఈ పాలసీ ద్వారా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఆటో-రిక్షాలు, సరుకు రవాణా వాహకాలు కొనుగోలుపై 30,000 రూపాయలు, కార్లపై 1.5 లక్షల వరకు సబ్సిడీకి అర్హులని తెలిపారు. కాగా ఢిల్లీకి చెందిన డీటెల్ కంపెనీ ఇప్పటికే 299 రూపాయలకే చీపెస్ట్ ఫీచర్ ఫోన్‌ను, అతిచౌకగా 3,999కే టీవీని అందించిన సంగతి తెలిసిందే. -
అతి చవకైన ఫోన్ ఇదే!
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ మొబైల్స్ తయారీదారు డీటెల్ కొత్తఫీచర్ ఫోన్ లాంచ్ చేసింది. 'డి 1 స్లిమ్' పేరుతో అతి తక్కువ ధరలో ఒక ఫీచర్‌ఫోన్‌ను సోమవారం విడుదల చేసింది. డీ1కు సక్సెసర్‌గా తీసుకొచ్చిన ఈ ఫీచర్ ఫోన్లో డిజిటల్ కెమెరా విత్‌ఎల్‌ఈడీ ఫ్లాష్ ప్రత్యేకతగా కంపెనీ చెబుతోంది. అడ్వాన్స్డ్ ఫీచర్లు, డిజైన్‌తో డీ1స్లిమ్ ఫీచర్ ఫోన్ మార్కెట్లో కొత్త ఒరవడిని సృష్టించనుందని డీటెల్ ఎండీ యోగేష్ భాటియా తెలిపారు. బీటుబీ అడ్డా వెబ్సైట్లో ఈఫోన్ లభించనుంది. గతంలో రూ. 299లకే డీ1 ఫీచర్‌ఫోన్ తీసుకొచ్చిన కంపెనీ భారతదేశంలో అతి తక్కువ విలువైన మొబైల్ ఫోన్ తమదే అని కంపెనీ పేర్కొంది. బ్లూ, గోల్డ్, పింక్ - మూడు కలర్ వేరియంట్లలో లభించనుంది. 2.8 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే, మైక్రోఎస్డీ కార్డు ద్వారా 16 జీబికి స్టోరేజ్ విస్తరణ, 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీవిస్తరించగల సామర్ధ్యం ఈ ఫోన్లో జోడించింది. ఈ ఫీచర్ ఫోన్ ధర 1199 రూపాయలు. -
జియోకు షాక్: రూ.299కే ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ: భారత టెలికాం రంగంలో రిలయన్స్ జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతాకాదు. జియో రాకతో టెలికం రంగం కుదేలైంది. ఇటీవల జియో వినియోగదారులందరికి ఉచితంగా ఫోన్ అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రిలయన్స్ జియోఫోన్‌కు షాక్ ఇస్తూ పోటీగా మార్కెట్లోకి కొత్త ఫోన్ రానుంది. కేవలం రూ.299 లకే ఓ కొత్త ఫోన్ లాంచ్ కి సిద్ధంగా వుంది. డీటెల్ అనే స్వదేశీ కంపెనీ నుంచి డీటెల్ డీ1 పేరుతో మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. రిలయన్స్ అధినేత జియో ఫోన్‌ను ఇండియా స్మార్ట్‌ఫోన్‌గా ప్రకటించారు. అయితే ఇది మాత్రం స్మార్ట్ ఫోన్ కాదు. ఇండియాలో తయారైన ఫీచర్ ఫోన్ ఇది. ప్రముఖ గాడ్గెజ్ విశ్లేషకుడు రాజీవ్ మఖ్నీ ఈ ఫోన్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. దీనిలో ఫీచర్స్ మాత్రం చాలా తక్కువ గా ఉంటాయి. ఫోన్ వివరాలు 1. 44 మోనో క్రోమ్ డిస్ప్లే అండ్ 650ఎంఏహెచ్ బ్యాటరీ సింగిల్ సిమ్‌కార్డు టార్చ్‌లైట్ ఎఫ్ఎం రేడియో స్పీకర్ వైబ్రేషన్ మోడ్లు ఇందులో ఉన్నాయి.