జియోకు షాక్‌: రూ.299కే ఫోన్‌ | Will this Rs 299 Detel D1 handset kill Jio Phone? | Sakshi
Sakshi News home page

జియోకు షాక్‌: రూ.299కే ఫోన్‌

Published Mon, Aug 21 2017 6:38 PM | Last Updated on Tue, Sep 12 2017 12:41 AM

Will this Rs 299 Detel D1 handset kill Jio Phone?



సాక్షి, న్యూఢిల్లీ:
భారత టెలికాం రంగంలో రిలయన్స్‌ జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతాకాదు. జియో రాకతో టెలికం రంగం కుదేలైంది. ఇటీవల జియో వినియోగదారులందరికి ఉచితంగా ఫోన్‌ అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రిలయన్స్‌ జియోఫోన్‌కు షాక్‌ ఇస్తూ​ పోటీగా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ రానుంది.

కేవలం రూ.299 లకే ఓ కొత్త ఫోన్ లాంచ్ కి సిద్ధంగా వుంది. డీటెల్  అనే స్వదేశీ కంపెనీ నుంచి డీటెల్‌ డీ1 పేరుతో మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. రిలయన్స్‌ అధినేత జియో ఫోన్‌ను ఇండియా స్మార్ట్‌ఫోన్‌గా ప్రకటించారు. అయితే ఇది మాత్రం స్మార్ట్‌ ఫోన్‌ కాదు. ఇండియాలో తయారైన ఫీచర్‌ ఫోన్‌ ఇది. ప్రముఖ గాడ్గెజ్‌ విశ్లేషకుడు రాజీవ్‌ మఖ్నీ ఈ ఫోన్‌ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. దీనిలో ఫీచర్స్ మాత్రం చాలా తక్కువ గా ఉంటాయి.  

ఫోన్‌ వివరాలు
1. 44 మోనో క్రోమ్ డిస్ప్లే అండ్
650ఎంఏహెచ్‌ బ్యాటరీ
సింగిల్‌ సిమ్‌కార్డు
టార్చ్‌లైట్‌
ఎఫ్‌ఎం రేడియో
స్పీకర్‌
వైబ్రేషన్‌ మోడ్‌లు ఇందులో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement