సాక్షి, న్యూఢిల్లీ: అతి తక్కువ ధరకే ఫీచర్ ఫోన్. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ సంచలన ప్రకటన చేసింది. కేవలం రూ. 499 రూపాయలకే అతి తక్కువ ధరకే ఫీచర్ ఫోన్‌ను తీసుకొచ్చింది. బీఎస్‌ఎన్‌ల్ మనోజ్ శర్మ జైపూర్‌లో దీన్ని లాంచ్ చేశారు ‘డీ టెల్ డీ 1’ పేరుతో దీని అసలు ధర రూ. 346. అయితే ఈ ఫీచర్ ఫోన్‌తో అందిస్తున్న తారిఫ్ ప్లాన్‌తో(రూ.153) కలిపి ఈ ఫోన్ ధరను రూ. 499గా బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించింది. బీఎస్‌ఎన్‌ఎల్ అఫీషియల్ లింక్‌లో దీన్ని ఆర్డర్ చేసుకోవచ్చు.
అలాగే మరో ఆఫర్ కూడా ఉంది. డీ టెల్ డీ 1 కొనుగోలుతో రూ.153 టాక్ టైం. ఒక సంవత్సరం వాలిడిటీ. అయితే దీంట్లో ఎలాంటా డేటా సేవలుఅందుబాటులో లేవు.
రిటైల్ గ్రామీణ ప్రాంత ప్రజలకు మొబైల్ ఫోన్, మొబైల్ సర్వీసులు , ముఖ్యంగా వాయిస్ కాలింగ్ సేవలు అందించేందుకు డీటె ల్ డి 1 చాలా ఉపయోపడుతుందని బిఎస్ఎన్ఎల్ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ 'సబ్ కా సాత్ సబ్‌కా వికాస్' పథకంలో భాగంగా దీన్ని తీసుకొస్తున్నట్టు తెలిపింది. ఫోన్ బుక్, లౌడ్ స్పీకర్, టార్చ్ లైట్ తదితర ఫీచర్లు ఇందులో పొందుపర్చినట్టు పేర్కొంది.
1.44 అంగుళాల మోనో క్రోమ్ డిస్‌ప్లే
2 జీ సింగిల్ సిమ్,
650 ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment