voice service
-
రూ. 346కే ఫీచర్ ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ: అతి తక్కువ ధరకే ఫీచర్ ఫోన్. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ సంచలన ప్రకటన చేసింది. కేవలం రూ. 499 రూపాయలకే అతి తక్కువ ధరకే ఫీచర్ ఫోన్‌ను తీసుకొచ్చింది. బీఎస్ఎన్ల్ మనోజ్ శర్మ జైపూర్‌లో దీన్ని లాంచ్ చేశారు ‘డీ టెల్ డీ 1’ పేరుతో దీని అసలు ధర రూ. 346. అయితే ఈ ఫీచర్ ఫోన్‌తో అందిస్తున్న తారిఫ్ ప్లాన్‌తో(రూ.153) కలిపి ఈ ఫోన్ ధరను రూ. 499గా బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్ అఫీషియల్ లింక్‌లో దీన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే మరో ఆఫర్ కూడా ఉంది. డీ టెల్ డీ 1 కొనుగోలుతో రూ.153 టాక్ టైం. ఒక సంవత్సరం వాలిడిటీ. అయితే దీంట్లో ఎలాంటా డేటా సేవలుఅందుబాటులో లేవు. రిటైల్ గ్రామీణ ప్రాంత ప్రజలకు మొబైల్ ఫోన్, మొబైల్ సర్వీసులు , ముఖ్యంగా వాయిస్ కాలింగ్ సేవలు అందించేందుకు డీటె ల్ డి 1 చాలా ఉపయోపడుతుందని బిఎస్ఎన్ఎల్ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ 'సబ్ కా సాత్ సబ్కా వికాస్' పథకంలో భాగంగా దీన్ని తీసుకొస్తున్నట్టు తెలిపింది. ఫోన్ బుక్, లౌడ్ స్పీకర్, టార్చ్ లైట్ తదితర ఫీచర్లు ఇందులో పొందుపర్చినట్టు పేర్కొంది. 1.44 అంగుళాల మోనో క్రోమ్ డిస్ప్లే 2 జీ సింగిల్ సిమ్, 650 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఆర్‌కామ్ యూజర్లకు బ్యాడ్‌న్యూస్
న్యూఢిల్లీ : నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న టెలికాం ఆపరేటర్ రిలయన్స్ కమ్యూనికేషన్ తన వాయిస్ కాల్ సర్వీసులను మూసివేస్తోంది. డిసెంబర్ 1 నుంచి తమ ఈ సర్వీసులను క్లోజ్ చేస్తున్నట్టు ఆర్‌కామ్ పేర్కొంది. తమ కస్టమర్లను ఈ ఏడాది చివరి నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు తరలించనున్నట్టు కూడా వెల్లడించింది. టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ ఆదేశాల మేరకు ఆర్‌కామ్ ఈ నిర్ణయం తీసుకుంది. రిలయన్స్ కమ్యూనికేషన్ లిమిటెడ్ కేవలం 4జీ డేటా సర్వీసులను మాత్రమే తన కస్టమర్లు అందించనుందని, తన సబ్స్క్రైబర్లకు ప్రస్తుతం అందిస్తున్న వాయిస్ సర్వీసులను 2017 డిసెంబర్ 1 నుంచి మూసివేస్తున్నట్టు ట్రాయ్ అన్ని టెలికాం ఆపరేటర్లకు చెప్పింది. ఆంధ్రప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, యూపీ ఈస్ట్, వెస్ట్, తమిళనాడు, కర్నాటక, కేరళ వంటి ఎనిమిది టెలికాం సర్కిళ్లలో 2జీ, 4జీ సర్వీసులను అందించనున్నట్టు ఆర్‌కామ్, ట్రాయ్‌కు తెలిపింది. సిస్టెమా శ్యామ్ టెలిసర్వీసెస్‌లో విలీనమైన తర్వాత సీడీఎంఏ నెట్‌వర్క్‌ను అప్గ్రేట్ చేస్తామని, ఢిల్లీ, రాజస్తాన్, యూపీ వెస్ట్, తమిళనాడు, కేరళ, కర్నాటక, పశ్చిమ బెంగాల్, గుజరాత్, కోల్‌కత్తాలకు 4జీ సర్వీసులను అందించనున్నట్టు అనిల్ అంబానీకి చెందిన ఈ సంస్థ తెలిపింది. అయితే సబ్స్క్రైబర్లు పెట్టుకునే ఎలాంటి పోర్టింగ్ అభ్యర్థనను కూడా సంస్థ నిరాకరించరాదని రెగ్యులేటరీ, ఆర్‌కామ్‌ను ఆదేశించింది. వాయిస్ సర్వీసులను మూసివేయాలని నిర్ణయించిన ఈ సంస్థ రూ.46వేల కోట్ల రుణాల్లో కొట్టుమిట్టాడుతోంది. ఎయిర్‌సెల్ విలీన ఒప్పందం బెడసికొట్టడంతో, తన వైర్లెస్ సర్వీసులను మూసివేసేందుకు సిద్ధమైంది. -
ఎయిర్టెల్.. ట్రింగ్
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ అక్టోబర్-డిసెంబర్(క్యూ3)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 610 కోట్లను తాకింది. గతేడాది(2012-13) ఇదే కాలంలో రూ. 284 కోట్లను మాత్రమే ఆర్జించింది. గడిచిన నాలుగేళ్లలో తొలిసారి లాభాల్లో వృద్ధిని సాధించింది. గత 15 త్రైమాసికాలుగా కంపెనీ లాభాలు తగ్గుతూ వచ్చిన సంగతి తెలిసిందే. మొబైల్ డేటా ఆదాయం పుంజుకోవడంతోపాటు, వాయిస్ సర్వీసులకు మెరుగైన ధర లభించడం లాభాల వృద్ధికి దోహదపడింది. ఇక ఇదే కాలానికి కంపెనీ మొత్తం ఆదాయం 13%పైగా పెరిగి రూ. 21,939 కోట్లకు చేరింది. గతంలో రూ. 19,362 కోట్లు నమోదైంది. కన్సాలిడేటెడ్ మొబైల్ ఇంటర్నెట్ ఆదాయం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 1,736 కోట్లను తాకింది. డేటా విభాగం భేష్.. దేశీయంగా ప్రస్తుతం డేటా వినియోగం నుంచే అత్యధిక ఆదాయం లభించనున్నట్లు కంపెనీ జేఎండీ గోపాల్ విఠల్ పేర్కొన్నారు. ఇండియాలో వినియోగదారుల సంఖ్య 31% జంప్‌చేసి 5.44 కోట్లకు చేరినట్లు వెల్లడించారు. డేటా వినియోగం కూడా 54.4%ను తాకడంతో ఒక్కో వినియోగదారునిపై లభించే డేటా ఆదాయం రూ. 75కు చేరినట్లు కంపెనీ తెలిపింది. వాయిస్ సర్వీసులతో కలిపి మొత్తంగా ఒక్కో వినియోగదారుడిపై లభించే సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 195ను తాకినట్లు వివరించింది. ఈ కాలంలో మొబైల్ ఇంటర్నెట్ రేట్లను 25% పెంచింది. వివిధ పథకాల్లో ప్రకటించే మినహాయింపులలో 50% కోత విధించింది. వాయిస్ సర్వీసులలోనూ డిస్కౌంట్ నిమిషాలను సగానికి తగ్గించింది. డిస్కౌంట్లను మరింత తగ్గిస్తాం వాయిస్ సర్వీసుల ధరలు ఇప్పటికీ 30-40% తక్కువగానే... దీంతో డిస్కౌంట్ నిమిషాలలో మరింత కోత పెట్టేందుకు అవకాశం ఉందని విఠల్ చెప్పారు. అయి తే సమీప కాలంలో ప్రధాన టారిఫ్‌లను పెంచే యోచన లేదన్నారు. డిసెంబర్ చివరికి కంపెనీ రుణ భారం రూ. 57,643 కోట్లుగా ఉంది. నష్టాలలోనే విదేశీ కార్యకలాపాలు ఆఫ్రికా, దక్షిణాసియా కార్యకలాపాల నుంచి ఆదాయం దాదాపు 19% పుంజుకుని రూ. 7,676 కోట్లను తాకింది. అయితే దీనిపై రూ. 1,124 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. అంతక్రితం రూ. 603 కోట్ల నికర నష్టం నమోదైంది.