ప్రపంచంలో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో భారత్ ఒకటిగా ఉంది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌తో పాటు ఫీచర్ ఫోన్ మార్కెట్‌లోనూ భారత్ దూసుకుపోతుంది. ఇటీవల కాలంలో కస్టమర్లు ఎక్కువగా చౌకైన ఫోన్లపై మొగ్గుచూపుతుండటం దీనికి కారణంగా నిలుస్తోంది. అంతేకాక రిలయన్స్, జియో ఫోన్‌ను ప్రవేశపెట్టి, ఫీచర్ ఫోన్ మార్కెట్‌కు మరింత పాపులారిటీ తీసుకొచ్చింది. దీంతో ఫీచర్ ఫోన్ మార్కెట్‌లో కొత్త కొత్త బ్రాండులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ బ్రాండులు కూడా అత్యంత సరసమైన ధరల్లో మార్కెట్‌లోకి వస్తున్నాయి. వాటిలో ఐకాల్, పీస్, వివా హ్యాండ్‌సెట్లు చౌకైన ధరలతో కస్టమర్లను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి.
ఆశ్చర్యకంగా ఐకాల్ బ్రాండు తన ఫీచర్‌ఫోన్ ఐకాల్ కే71ను అత్యంత తక్కువగా 249 రూపాయలకే ఆఫర్ చేస్తుంది. ఎక్స్‌క్లూజివ్ ఈ ఫీచర్ ఫోన్ షాప్ క్లూస్‌లో మాత్రమే అందుబాటులో ఉంచింది. ఈ డివైజ్ 800 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంటే టాక్‌టైమ్ పరంగా నాలుగు గంటల వరకు, స్టాండ్‌బై టైమ్ 24 గంటల వరకు ఉండనుంది. 1.4 అంగుళాల మోనోక్రోమ్ డిస్‌ప్లే, టార్చ్, ఎఫ్‌ఎం ప్లేయర్, ఏడాది పాటు వారెంటీని ఈ ఫీచర్ ఫోన్ అందిస్తోంది. రెడ్, బ్లూ, డార్క్ బ్లూ, ఎల్లో రంగుల్లో ఈ ఫీచర్ ఫోన్ అందుబాటులో ఉంది. పీస్ పీ3310, వివా వీ1 హ్యాండ్‌సెట్లు కూడా చౌకగా 349 రూపాయలకే లభ్యమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment