ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిటైల్, టెలికం విభాగాలకు భారీ ఎత్తున ఉద్యోగాలు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో జియోకి 41 వేల మంది, రిలయన్స్ రీటైల్‌లో లక్ష కంటే ఎక్కువ మంది ఉద్యోగులు రిజైన్ చేసిట్లు సమాచారం. రిలయన్స్ వార్షిక నివేదిక ప్రకారం.. సంస్థలో అట్రిషన్ రేటు 64.8 శాతం పెరిగింది.
ఇటీవల కాలంలో రిలయన్స్ కంపెనీ ఇతర రీటైల్ స్టార్టప్‌లను కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఉద్యోగుల సర్ధుబాటు, అదే సమయంలో పెరిగిపోతున్న నియమకాలను అందిపుచ్చుకునేందుకు ఉద్యోగులు సంస్థను వదిలి వెళ్లినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.
మొత్తంగా, ఆర్ధిక సంవత్సరం 2023లో 167,391 మంది ఉద్యోగులు రిలయన్స్ నుంచి వైదొలిగారు. ఇందులో రిటైల్, జియో విభాగాలు ఉన్నాయి. సంస్థకు రాజీనామా చేసిన వారిలో ఎక్కువ మంది జూనియర్‌లు, మిడ్ మేనేజ్‌మెంట్ స్థాయి ఉద్యోగులు ఉన్నట్లు రియలన్స్ ప్రతినిధులు తెలిపారు.
అంతకు మించి.. కొత్త నియామకాలు
ఉద్యోగులు సంస్థకు రాజీనామా చేస్తున్నప్పటికీ రిలయన్స్ ఆర్ధిక సంవత్సరం 2023లో 262,558 మంది ఉద్యోగులను నియమించుకుంది. కొత్త ఉద్యోగుల్నితీసుకునే పనిలో పడినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి.
అందరి చూపు ఆగస్ట్ 28 వైపే
కాగా, ఆగస్ట్ 28న మధ్యాహ్నం 2 గంటలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ తన 46వ వార్షిక సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటికే ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది. ఇక ఈ ఈవెంట్ సందర్భంగా, రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, రాబోయే జియోఫోన్ 5జీ, కస్టమర్-ఫోకస్డ్ జియో 5G ప్లాన్‌లు, వివిధ అంశాలపై ముఖ్యమైన అప్‌డేట్‌లను ప్రకటించాలని భావిస్తున్నారు.
ఇదీ చదవండి : టమాట ధరలు.. సామాన్యులకు భారీ ఊరట?!
Comments
Please login to add a commentAdd a comment