స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు రయ్.. | Smartphone Sales Top Feature Phones Thanks to Samsung | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు రయ్..

Published Thu, Aug 15 2013 2:02 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు రయ్.. - Sakshi

స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు రయ్..

 న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల అమ్మకాల జోరు అంతకంతకూ పెరుగుతోంది. ఫీచర్ ఫోన్ల అమ్మకాలు మాత్రం నానాటికీ దిగజారుతున్నాయి. ఈ వివరాలను అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ గార్ట్‌నర్ వెల్లడించింది. గార్ట్‌నర్ నివేదిక ప్రకారం...
 

  •   ఈ ఏడాది ఏప్రిల్-జూన్ క్వార్టర్‌కి స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు 47% వృద్ధితో 22.5 కోట్లకు పెరిగాయి.
  •    ఫీచర్ ఫోన్ల అమ్మకాలు ఏకంగా 21శాతం తగ్గి 21 కోట్లకు పడిపోయాయి.
  •    ఫీచర్ ఫోన్ల అమ్మకాలను స్మార్ట్ ఫోన్లు అధిగమించడం ఇదే మొదటిసారి
  •    మొత్తంమీద 43.5 కోట్ల మొబైల్ ఫోన్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే క్వార్టర్‌తో పోల్చితే అమ్మకాలు 3.6% పెరిగాయి.
  •    మొత్తం మొబైల్  సేల్స్‌లో స్మార్ట్‌ఫోన్ల వాటా 52 %.
  •    స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల వృద్ధి అత్యధికంగా(74 శాతం) ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఉంది. లాటిన్ అమెరికా(56 శాతం), తూర్పు యూరప్(31 శాతం)లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
  •    స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో అగ్రస్థానం శామ్‌సంగ్ కంపెనీదే. గత ఏప్రిల్-జూన్ క్వార్టర్‌కు 29.7 శాతంగా ఉన్న ఈ కంపెనీ మార్కెట్ వాటా ఈ ఏడాది ఇదే క్వార్టర్‌కి 31.7 శాతానికి పెరిగింది. ఈ కంపెనీ 7.13 కోట్ల స్మార్ట్‌ఫోన్లను విక్రయించింది. 5.1 శాతం మార్కెట్ వాటా(1.1 కోట్లు)తో ఎల్‌జీ, 4.7 శాతం మార్కెట్ వాటాతో(1.06 కోట్లు)తో లెనోవొ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
  •    మొత్తం మొబైల్ మార్కెట్లోనే శామ్‌సంగ్‌దే అగ్రస్థానం.  10.75 కోట్ల ఫోన్ విక్రయాలతో(24.7% మార్కెట్ వాటా) టాప్‌లో నిలిచింది.  తర్వాతి స్థానాల్లో నోకియా(6.09 కోట్లు-14% మార్కెట్ వాటా), యాపిల్(7.3% మార్కెట్ వాటా), ఎల్‌జీ(3.9% మార్కెట్ వాటా)లు నిలిచాయి.
  •    ఇక స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ల విషయంలో ఆండ్రాయిడ్ దూసుకుపోతోంది. 79 శాతం మార్కెట్ వాటాతో ఆండ్రాయిడ్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో మైక్రోసాఫ్ట్, బ్లాక్‌బెర్రీలు నిలిచాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement