Nokia 110 4G/2G: రిలయన్స్ జియో బాటలోనే నోకియా కూడా తక్కువ ధరకు 4జీ ఫీచర్ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇందులో యూపీఐ (UPI) పేమెంట్ ఆప్షన్‌ను ఇన్‌బిల్ట్‌గా ఇవ్వడం విశేషం. నోకియా 110 4జీ (Nokia 110 4G), నోకియా 110 2జీ (Nokia 110 2G) ఫీచర్ ఫోన్లకు సంబంధించిన 2023 మోడల్‌లు తాజాగా విడుదలయ్యాయి. వీటి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
ఇదీ చదవండి: హాట్ డీల్: రూ.12 వేలకే లేటెస్ట్ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్!
స్పెసిఫికేషన్స్
నోకియా 110 4G/2G ఫోన్ల 2023 మోడల్‌లను 2021 మోడల్‌తో పోలిస్తే చాలా ఆకర్షణీయంగా రూపొందించారు. కొత్త కొత్త రంగుల్లో నూతన ఫోన్లు ప్రీమియంగా కనిపిస్తున్నాయి. నోకియా 110 4జీ ఫోన్ మిడ్‌నైట్ బ్లూ, ఆర్కిటిక్ పర్పుల్ రంగుల్లో లభిస్తుండగా నోకియా 110 2జీ ఫోన్ చార్‌కోల్, క్లౌడీ బ్లూ కలర్స్‌లో అందుబాటులో ఉంది. విశేషమేమిటంటే, ఈ కొత్త మోడల్‌ల ఫోన్లలో ఇన్‌బిల్ట్ యూపీఐ పేమెంట్ ఫీచర్ ఇచ్చారు. యూజర్లు ఒక బటన్‌ను నొక్కడం ద్వారా సులభంగా యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు. నోకియా 110 4జీలో బలమైన 1450mAh బ్యాటరీ, నోకియా 110 2జీ ఫోన్‌లో 1000mAh బ్యాటరీ ఇచ్చారు. రెండు ఫోన్‌లలోనూ 32జీబీ వరకు స్టోరేజ్‌ను విస్తరించుకోవచ్చు. నోకియా 110 4జీ ధర రూ.2,499, నోకియా 110 2జీ ఫోన్ ధర రూ.1,699లుగా ఉంది. వీటిని నోకియా రిటైల్ స్టోర్లలోనూ, నోకియా అధీకృత, భాగస్వామ్య వెబ్‌సైట్లలోనూ కొనుగోలు చేయవచ్చు.
ఫీచర్స్
- 1.8″ QQVGA డిస్‌ప్లే
- QVGA రిజల్యూషన్‌తో కూడిన రియర్ కెమెరా
- 12 రోజుల స్టాండ్‌బై టైమ్, 8 గంటల టాక్ టైమ్ అందించే 1450mAh బ్యాటరీ. ( నోకియా 110 2Gలో 1000mAh బ్యాటరీ)
- నానో ఆకృతిలో పాలికార్బోనేట్‌తో తయారు చేసిన బ్యాక్ ప్యానెల్
- IP52 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్
- వైర్‌లెస్ FM రేడియో
- S30+ ఆపరేటింగ్ సిస్టమ్
- 94.5 గ్రాముల బరువు
- 50mm x 121.5mm x 14.4mm కొలతలు
ఇదీ చదవండి: ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
Comments
Please login to add a commentAdd a comment