స్మార్ట్‌ఫోన్, ఫీచర్ ఫోన్లపై లావా బంపర్ ఆఫర్
స్మార్ట్‌ఫోన్, ఫీచర్ ఫోన్లపై లావా బంపర్ ఆఫర్
Published Sat, Aug 26 2017 11:17 AM | Last Updated on Sun, Sep 17 2017 5:59 PM
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ మొబైల్ కంపెనీ లావా, తన అన్ని మేజర్ మోడల్స్‌పై రెండేళ్ల వారెంటీని ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న తన పోర్ట్‌ఫోలియోలోని స్మార్ట్‌ఫోన్లు, ఫీచర్ ఫోన్లపై ఈ వారెంటీ అందిస్తానని లావా పేర్కొంది. భవిష్యత్తులో లాంచ్ చేయబోయే అన్ని మోడల్స్‌కు ఈ రెండేళ్ల వారెంటీ ఉంటుందని తెలిపింది. భారత మొబైల్ హ్యాండ్‌సెట్ ఇండస్ట్రీలో ఈ విధంగా వారెంటీ ఆఫర్‌ను ప్రకటించడం ఇదే మొదటిసారి. ఆగస్టు 26 తర్వాత కొనుగోలు చేసిన హ్యాండ్‌సెట్లకు రెండేళ్ల వారెంటీ యాక్టివేట్ అవుతుంది. యాక్ససరీస్‌పై కూడా ఆరు నెలల ప్రామాణికమైన వారెంటీ క్లాష్ ఉంటుంది. టచ్ ప్యానల్ లేదా ఎల్‌సీడీ డిస్‌ప్లేకు ఏడాది పాటు ఈ వారెంటీ కొనసాగుతుంది.
ఈ సమయం తమకు ఎంతో అద్భుతమైన క్షణాలని, దేశీయ మొబైల్ హ్యాండ్‌సెట్ ఇండస్ట్రిలో తమ బలాన్ని మరింత పెంచుకుంటున్నామని రెండేళ్ల వారెంటీ స్కీమ్ లాంచ్ సందర్భంగా లావా ఇంటర్నేషనల్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ గౌరవ్ నిగమ్ చెప్పారు. తన పోర్ట్‌ఫోలియో డివైజ్‌లకు రెండేళ్ల వారెంటీని ప్రకటిస్తున్నామని, దేశీయ మొబైల్ ఫోన్ బ్రాండులో ఇలా ఆఫర్ చేయడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. తమ ఉత్పత్తిని అభివృద్ధి చేసే ప్రతి స్టేజీలో క్వాలిటీ కంట్రోల్‌పై ఎక్కువగా ఫోకస్ చేస్తామని నిగమ్ తెలిపారు.
Advertisement
Advertisement