న్యూఢిల్లీ: మొబైళ్లు తయారు చేసే లావా కంపెనీ ఆండ్రాయిడ్ ఓరియో(గో ఎడిషన్)లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. జడ్50 పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ భాగస్వామ్యంతో తక్కువ ధరకే అందిస్తున్నామని లావా తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.4,000 అని భారతీ ఎయిర్‌టెల్ మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్(నా తొలి స్మార్ట్‌ఫోన్) కార్యక్రమంలో భాగంగా ఆ కంపెనీ రూ.2,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ని ఇస్తోందని, దీంతో ఈ ఫోన్ రూ.2,400కే లభిస్తుందని వివరించింది.
ఈ జడ్50 స్మార్ట్‌ఫోన్‌లో 4.5 అంగుళాల డిస్‌ప్లే, 1.1 గిగాహెట్జ్ క్వాడ్–కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్పేస్, 5 మెగా పిక్సెల్ రియర్, ఫ్రంట్ కెమెరా విత్ ఫ్లాష్ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్ లక్షకు పైగా రిటైల్ స్టోర్స్‌లతో పాటు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్ వంటి ఈ కామర్స్ వెబ్‌సైట్‌ల్లో కూడా లభిస్తుందని పేర్కొంది. గూగుల్ సంస్థ గత ఏడాది డిసెంబర్‌లో ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్‌లో ఒక స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ ఓఎస్‌పై పనిచేసే స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌లు తక్కువ డేటాను వినియోగించుకుంటూనే వేగంగా పనిచేస్తాయి.
ఆండ్రాయిడ్ ఓరియోలో లావా కొత్త స్మార్ట్‌ఫోన్
Published Sat, Mar 24 2018 1:35 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment