లావా మాగ్నమ్ ఫ్యాబ్లెట్...
దేశీ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కిట్‌క్యాట్‌తో పనిచేసే సరికొత్త ఫ్యాబ్లెట్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఆరు అంగుళాల స్క్రీన్ సైజుగల ఈ ఎక్స్604 1.2 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌పై నడుస్తుంది. కిట్‌క్యాట్ అతితక్కువ మెమరీని ఉపయోగించుకుంటుంది కాబట్టి ప్రాసెసర్ వేగం మరింత ఎక్కువగా ఉంటుందన్నమాట. ఒక గిగబైట్ ర్యామ్, 8 జీబీల మెమరీ ఉన్న ఈ ఫ్లాబ్లెట్‌లో బీఎస్‌ఐ సెన్సర్‌తో కూడిన 8 ఎంపీ ప్రధాన కెమెరా ఉంది. వీడియో కాలింగ్ కోసం రెండు ఎంపీల కెమెరాను వాడారు. కేవలం 8.9 మిల్లీమీటర్ల మందం, 210 గ్రాముల బరువు ఎక్స్604 ప్రత్యేకతలు. 2800 ఎంఏహెచ్ బ్యాటరీతో ఎనిమిది గంటల టాక్‌టైమ్, 200 గంటల స్టాండ్‌బై టైమ్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. తెలుపు, నలుపు రంగుల్లో లభించే ఈ ఫ్యాబ్లెట్ ఖరీదు రూ.11,999.
36.3 ఎంపీ రెజల్యూషన్‌తో నికాన్ డీ810
స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తరువాత కెమెరాలతో పనిలేకుండా పోయింది. కానీ చిత్రాల్లో స్పష్టత, రకరకాల పరిస్థితుల్లో ఫొటోలు తీసుకోవాలంటే మాత్రం పూర్తిస్థాయి కెమెరాలను వాడాల్సిందే. ఈ నేపథ్యంలో అటు ఫొటోగ్రఫీ వృత్తిలో ఉన్నవారికి, ఇటు ఔత్సాహికులకూ ఉపయోగపడేలా నికాన్ కంపెనీ సరికొత్త డీఎస్‌ఎల్‌ఆర్ కెమెరా ఒకదాన్ని విడుదల చేసింది. డీ810 అని పిలుస్తున్న ఈ కొత్త కెమెరా రెజల్యూషన్ 36.3 ఎంపీ కావడం విశేషం. ఫుల్ హెచ్‌డీ క్వాలిటీతో వీడియోలు తీసుకోగలగడం మరో ప్రత్యేకత. ఈ వీడియో కెమెరా ఏకంగా సెకనుకు 60 ఫ్రేమ్‌లు రికార్డు చేయగలదు. డీ810 ఎఫ్‌ఎక్స్ అంటే ఫుల్ ఫ్రేమ్ ఫార్మాట్‌లో పనిచేస్తుంది కాబట్టి ఫొటోలను ఎంతగా ఎన్‌లార్జ్ చేసినప్పటికీ చిత్ర నాణ్యత తగ్గదు. హెచ్‌డీఎంఐ ఔట్‌పుట్ ద్వారా వీడియోలు, ఫొటోలను కెమెరాలో కాకుండా ఇతర మాధ్యమాల్లో నేరుగా స్టోర్ చేసుకోవచ్చు. అత్యాధునిక నికార్ లెన్సులు, ఎక్స్‌స్పీడ్ 4 ఇమేజ్ ప్రాసెసింగ్ ఇంజిన్ల ద్వారా చిత్ర నాణ్యతను పెంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కంపెనీ చెబుతోంది.
కొత్త సరకు
Published Thu, Jul 10 2014 12:07 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM
Advertisement