టీసీఎస్ సోషల్ సాకర్ | TCS Social Soccer | Sakshi
Sakshi News home page

టీసీఎస్ సోషల్ సాకర్

Published Wed, Jul 2 2014 11:59 PM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

టీసీఎస్ సోషల్ సాకర్ - Sakshi

టీసీఎస్ సోషల్ సాకర్

 భలే ఆప్స్
 
ప్రపంచకప్ ఫుట్‌బాల్ పోటీలు బ్రెజిల్‌లో ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. లీగ్ దశ దాటి నాకౌట్‌కు చేరుకున్న ఈ టోర్నీ వివరాలు ఎలాగైనా తెలుసుకోవచ్చు. కానీ పోటీల సందర్భంగా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలోని ఉత్సాహాన్ని, ఆసక్తికరమైన కామెంట్ల గురించి తెలుసుకోవాలంటే మాత్రం టీసీఎస్ సోషల్ సాకర్ అప్లికేషన్‌ను వాడాల్సిందే. ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్‌సీ సర్వీసెస్ అభివృద్ధి చేసిన ఈ అప్లికేషన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ ప్రేమికులు మ్యాచ్‌లపై ఎలాంటి కామెంట్లు చేశారు? వారి మూడ్స్ ఎలా ఉన్నాయి? అన్నది ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. హైటెక్ అల్గారిథమ్స్ సాయంతో రియల్‌టైమ్‌లో మ్యాచ్ అనాలసిస్ ఇవ్వడంతోపాటు
 
ట్విట్టర్ డేటాను కూడా సేకరించి ఇస్తుంది ఈ అప్లికేషన్. అంతేకాకుండా సహచర ఫ్యాన్స్‌తో మాట్లాడేందుకు, అభిప్రాయాలు పంచుకునేందుకు వేదికగా నిలుస్తుంది.
 
మీకిష్టమైన టీమ్ వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. లొకేషన్ ఆధారిత సెంటిమెంట్లను కూడా తెలుసుకోవచ్చు. ప్రతి టీంపై ఎవరు ఏమనుకుంటున్నారో కూడా ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది. ఆండ్రాయిడ్‌తోపాటు ఆపిల్ ఐఓఎస్‌కూ అందుబాటులో ఉన్న ఈ సోషల్ సాకర్ అప్లికేషన్‌ను  App Store/iOS: http://on.tcs.com/SocSociOS, Play Store/Android: http://on.tcs.com/SocSocAndroidలింక్‌ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement