Nikon
-
వెడ్డింగ్ ఫిల్మ్ మేకర్స్ అటెన్షన్! (ఫొటోలు)
-
ప్రపంచం లోనే అతి చిన్న మిర్రర్ లెస్ కెమెరా..!
-
రాజమండ్రిలో ఎక్స్‌పీరియెన్స్ జోన్ ప్రారంభించిన నికాన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇమేజింగ్ టెక్నాలజీ దిగ్గజం నికాన్ ఇండియా తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో ఎక్స్‌పీరియెన్స్ జోన్‌ను ఏర్పాటు చేసింది. మిర్రర్‌లెస్ సిరీస్, డీఎస్ఎల్ఆర్, హై జూమ్ కూల్‌పిక్స్ కెమెరాలు, లెన్సులు, యాక్సెసరీస్, స్పోర్ట్ ఆప్టిక్స్ శ్రేణి ఇక్కడ కొలువుదీరాయి. ఇదీ చదవండి: రూ. 2000 నోట్ల రద్దు: షాపింగ్ చేసుకోవచ్చా? వినియోగదార్లలో సృజనాత్మకతను వెలికితీసేందుకు, ఆవిష్కరణలు, కల్పనతో ఫోటోగ్రఫీ అభిరుచిని కొనసాగించడానికి వారిని శక్తివంతం చేయడం లక్ష్యంగా ఇటువంటి జోన్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. మరిన్ని ఇంట్రస్టింగ్ వార్తలు, విశేషాలు కోసం చదవండి సాక్షి, బిజినెస్ అన్నీ సాహసాలే: ఆరు నెలలకే వేల కోట్ల బిజినెస్! -
సమస్యలు ఉన్నా.. తగ్గేదేలే మన టార్గెట్ 1,000కోట్లు!
కోల్‌కతా: ఇమేజింగ్ ఉత్పత్తుల కంపెనీ నికాన్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.900 కోట్ల టర్నోవర్ సాధిస్తానన్న అంచనాతో ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్ల టర్నోవర్ సాధించాలన్న లక్ష్యంతో ఉంది. ఈ వివరాలను నికాన్ ఇండియా ఎండీ సజ్జన్ కుమార్ వెల్లడించారు. సరఫరా పరంగా సమస్యలు ఉన్నా, తయారీ వ్యయాలు పెరిగి మార్జిన్లపై ఒత్తిళ్లు ఉన్నప్పటికీ.. పండుగల విక్రయాలను దృష్టిలో పెట్టుకుని ధరలను పెంచలేదని చెప్పారు. వార్షిక అమ్మకాల్లో 30–35 శాతం మేర ఓనమ్ నుంచి దీపావళి మధ్య నమోదవుతాయన్నారు. కరోనా ముందస్తు అమ్మకాలను ఈ ఏడాది అధిగమిస్తామని చెప్పారు. కెమెరా మార్కెట్ వార్షిక పరిమాణం రూ.3,000 కోట్లుగా ఉంటుందన్నారు. సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు, నిపుణులే తమ ఉత్పత్తుల విక్రయాలకు మద్దతుదారులుగా చెప్పారు. సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు ఉపయోగించే ఆరంభ స్థాయి నుంచి మధ్య స్థాయి కెమెరాల విక్రయాల్లో 45 శాతం వృద్ధి ఉన్నట్టు తెలిపారు. విలువ పరంగా చూస్తే ఈ విభాగం వాటా ఇమేజింగ్ మార్కెట్లో 25 శాతం ఉంటుందన్నారు. ఈ విభాగంలో తమకు మార్కెట్‌ను శాసించే ‘నికాన్ జెడ్ 30’ కెమెరా ఉన్నట్టు ప్రకటించారు. నిపుణులు వినియోగించే కెమెరాల విక్రయాల్లోనూ 20 శాతం వృద్ధి ఉందని సజ్జన్ కుమార్ తెలిపారు. చదవండి: ఉద్యోగం వదిలి 2 లక్షల పెట్టుబడితో కంపెనీ.. కట్ చేస్తే 75 కోట్ల టర్నోవర్ -
వినూత్న ఫీచర్లతో నికాన్ డీ5500..
కెమెరాలు హైటెక్ హంగులు సమకూర్చుకుని చాలాకాలమైనప్పటికీ జపనీస్ కంపెనీ నికాన్ మరో అడుగు ముందుకేసి మరిన్ని అదనపు ఫీచర్లతో తాజాగా డీ 5500 కెమెరాను మార్కెట్లోకి తెచ్చింది. ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ల కోసం ఉద్దేశించిందైనప్పటికీ ఫొటోగ్రఫీని చాలావరకూ సులభతరం చేయడం ద్వారా సామాన్యులు కూడా దీన్ని అలవోకగా ఉపయోగించవచ్చు. డీఎక్స్ ఫార్మాట్లో 24.2 మెగాపిక్సెళ్ల రెజల్యూషన్ ఫొటోలను అందించే డీ5500లో వేరీయాంగిల్ ఎల్సీడీ మానిటర్, టచ్‌స్క్రీన్ కంట్రోల్ దీంట్లోని చెప్పుకోదగ్గ రెండు ఫీచర్లు. ఫొటోలు తీసేటప్పుడు ఎల్సీడీలోని టచ్ సెన్సిటివ్ ఆపరేషన్స్ ఏవీ పనిచేయవు. ఫలితంగా అనుకోకుండా కమాం్డడ్స్ నొక్కుకుపోయి ఫొటోల్లో తేడా వచ్చే ప్రమాదం తప్పుతుంది. వ్యూఫైండర్ దగ్గరి నుంచి కన్ను తొలగిన వెంటనే ఇమేజ్ రివ్యూ ఆపరేషన్లు వాటంతట అవే ప్రారంభం కావడం, ఎల్సీడీ మానిటర్ ఆన్/ఆఫ్‌లను నియంత్రించడం ద్వారా బ్యాటరీని ఆదా చేయడం మరికొన్ని ఫీచర్లు. వచ్చే నెల నుంచి అందుబాటులోకి వచ్చే ఈ డీఎస్ఎల్ఆర్ కెమెరా ఖరీదు లెన్సులను బట్టి రూ.55 వేల నుంచి రూ.69 వేల వరకూ ఉంది. -
కొత్త సరకు
లావా మాగ్నమ్ ఫ్యాబ్లెట్... దేశీ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కిట్‌క్యాట్‌తో పనిచేసే సరికొత్త ఫ్యాబ్లెట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఆరు అంగుళాల స్క్రీన్ సైజుగల ఈ ఎక్స్604 1.2 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌పై నడుస్తుంది. కిట్‌క్యాట్ అతితక్కువ మెమరీని ఉపయోగించుకుంటుంది కాబట్టి ప్రాసెసర్ వేగం మరింత ఎక్కువగా ఉంటుందన్నమాట. ఒక గిగబైట్ ర్యామ్, 8 జీబీల మెమరీ ఉన్న ఈ ఫ్లాబ్లెట్లో బీఎస్ఐ సెన్సర్‌తో కూడిన 8 ఎంపీ ప్రధాన కెమెరా ఉంది. వీడియో కాలింగ్ కోసం రెండు ఎంపీల కెమెరాను వాడారు. కేవలం 8.9 మిల్లీమీటర్ల మందం, 210 గ్రాముల బరువు ఎక్స్604 ప్రత్యేకతలు. 2800 ఎంఏహెచ్ బ్యాటరీతో ఎనిమిది గంటల టాక్‌టైమ్, 200 గంటల స్టాండ్‌బై టైమ్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. తెలుపు, నలుపు రంగుల్లో లభించే ఈ ఫ్యాబ్లెట్ ఖరీదు రూ.11,999. 36.3 ఎంపీ రెజల్యూషన్‌తో నికాన్ డీ810 స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తరువాత కెమెరాలతో పనిలేకుండా పోయింది. కానీ చిత్రాల్లో స్పష్టత, రకరకాల పరిస్థితుల్లో ఫొటోలు తీసుకోవాలంటే మాత్రం పూర్తిస్థాయి కెమెరాలను వాడాల్సిందే. ఈ నేపథ్యంలో అటు ఫొటోగ్రఫీ వృత్తిలో ఉన్నవారికి, ఇటు ఔత్సాహికులకూ ఉపయోగపడేలా నికాన్ కంపెనీ సరికొత్త డీఎస్ఎల్ఆర్ కెమెరా ఒకదాన్ని విడుదల చేసింది. డీ810 అని పిలుస్తున్న ఈ కొత్త కెమెరా రెజల్యూషన్ 36.3 ఎంపీ కావడం విశేషం. ఫుల్ హెచ్డీ క్వాలిటీతో వీడియోలు తీసుకోగలగడం మరో ప్రత్యేకత. ఈ వీడియో కెమెరా ఏకంగా సెకనుకు 60 ఫ్రేమ్‌లు రికార్డు చేయగలదు. డీ810 ఎఫ్ఎక్స్ అంటే ఫుల్ ఫ్రేమ్ ఫార్మాట్లో పనిచేస్తుంది కాబట్టి ఫొటోలను ఎంతగా ఎన్లార్జ్ చేసినప్పటికీ చిత్ర నాణ్యత తగ్గదు. హెచ్డీఎంఐ ఔట్పుట్ ద్వారా వీడియోలు, ఫొటోలను కెమెరాలో కాకుండా ఇతర మాధ్యమాల్లో నేరుగా స్టోర్ చేసుకోవచ్చు. అత్యాధునిక నికార్ లెన్సులు, ఎక్స్స్పీడ్ 4 ఇమేజ్ ప్రాసెసింగ్ ఇంజిన్ల ద్వారా చిత్ర నాణ్యతను పెంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కంపెనీ చెబుతోంది.