Karnataka School Kid Dies With Cardiac Arrest In Sleep In Kudumangalore Village - Sakshi
Sakshi News home page

Karnataka: అయ్యో కీర్తన్‌.. నిద్రలో ఉలిక్కిపాటు.. చిన్నారి గుండె ఆగింది!

Jan 9 2023 1:04 PM | Updated on Jan 9 2023 3:35 PM

Karnataka School Kid Dies With Cardiac Arrest in Sleep - Sakshi

చిన్నాపెద్దా తేడా లేదు. ఎలాంటి అనారోగ్యమూ ఉన్నట్లు కనిపించదు. కానీ, ఉన్నట్లుండి గుండె ఆగిపోయి ప్రాణాలు పోతున్నాయి. నిత్యం దేశంలో ఏదో ఒక మూల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఉన్నట్లుండి కుప్పకూలి మరణిస్తున్నారని వినడం పరిపాటిగా మారింది. దీనికి కారణాలపై రకరకాల చర్చలు జరుగుతున్నా.. సకాలంలో సమస్యను(చిన్నదైనా సరే) గుర్తించకపోవడమే అసలైన కారణమని అంటున్నారు వైద్య నిపుణులు. 

తాజాగా.. కర్ణాటకలో పన్నెండేళ్ల చిన్నారి కార్డియాక్‌ అరెస్ట్‌తో కన్నుమూశాడు. కుశాల్‌నగర్‌లో కూడుమంగళూరు గ్రామంలో ఆదివారం వేకువ ఝామున ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. నిద్రలోనే ఉలిక్కిపడి లేచి విలవిలలాడిన చిన్నారి.. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే కన్నుమూశాడు. బాధితుడిని కొప్పాలో ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్న కీర్తన్‌గా గుర్తించారు.

శనివారం సాయంత్రం ఆడుకుని ఇంటికి వచ్చిన చిన్నారి.. భోజనం చేసి పడుకున్నాడు. అయితే.. నిద్రలో ఉలిక్కిపడి లేచి ఏడ్వడం మొదలుపెట్టాడు. ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే మార్గం మధ్యలోనే ఆ చిన్నారి కన్నుమూశాడు. కీర్తన్‌ తండ్రి మంజాచారీ.. కొడుకు చదివే స్కూల్‌లోనే వ్యాన్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పన్నెండేళ్లకే ఆ చిన్నారికి నూరేళ్లు నిండడంతో స్థానికంగా విషాదం అలుముకుంది.

Cardiac Arrest: ఇలా చేస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement