బకెట్లో పడి చిన్నారి మృతి | kid died accidentally falling in water bucket | Sakshi
Sakshi News home page

బకెట్లో పడి చిన్నారి మృతి

Published Sun, Aug 23 2015 5:57 PM | Last Updated on Sun, Sep 3 2017 8:00 AM

kid died accidentally falling in water bucket

మహబూబ్‌నగర్(గోపాల్‌పేట్): బకెట్లో పడి ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా గోపాల్‌పేట మండలం నాగాపూర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి, భార్గవి దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు బిట్టు(2)ను మంచం మీద పడుకోబెట్టి ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండగా ఈ విషాదం జరిగింది. ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తూ మంచం పక్కనే ఉన్న నీళ్ల బకెట్‌లో పడి మృతి చెందాడు. బాలుడు బకెట్లో పడ్డ సంగతి ఆలస్యంగా తెలియడంతో అప్పటికే ఘోరం జరిగిపోయింది. చిన్నారి బిట్టు మృతితో ఆ ఇంట్లో విషాదం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement