మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలంలోని చంద్రాయగూడ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు మృతిచెందాడు.
కొత్తూరు: మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలంలోని చంద్రాయగూడ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు మృతిచెందాడు. చంద్రాయగూడలో రోడ్డు దాటుతున్న బాలుణ్ని షాద్‌నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివకుమార్(9) అనే బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు. బాలుడి స్వస్థలం రంగారెడ్డి జిల్లా పరిగి మండలం చిట్యాల గ్రామం. కన్నకొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.