కారు ఢీకొని బాలుడి మృతి | boy died in a road accident in nalgonda district | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 20 2015 7:13 PM | Last Updated on Fri, Mar 22 2024 11:04 AM

రోడ్డు దాటుతున్న ఓ బాలుడ్ని కారు ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలై అతడు ప్రాణాలు విడిచాడు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ శివారులోని పాత పెట్రోల్ బంక్ వద్ద ఆదివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. కొంపెల్లి గణేష్ (11) రోడ్డు దాటుతున్న నమయంలో హైదరాబాద్ వైపు వెళుతున్న కారు బాలుడిని వేగంగా వచ్చి ఢీకొంది. తీవ్ర గాయాలైన బాలుడ్ని అదే కారులో ఎక్కించుకుని హైదరాబాద్‌కు తీసుకెళుతుండగా మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ బాలుడి మృతదేహాన్ని కారులోని వారు చిట్యాల మండలం ఎలిమినేడు వరకు తీసుకెళ్లి అక్కడ పడేసి వెళ్లిపోయారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement