జిన్నారం(మెదక్): బకెట్‌లో పడిన బంతిని తీసుకునేందుకు యత్నించి.. అందులో తలకిందులుగా పడిపోయిన ఏడాదిన్నర చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన మెదక్ జిల్లా జిన్నారం మండలంలో మంగళవారం జరిగింది. మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన కుమార్, రేణుక దంపతుల కుమారుడు శివ. ఏడాదిన్నర వయసున్న ఈ బాలుడు మంగళవారం ఉదయం ఇంటి ఆవరణలో బంతితో ఆడుకుంటున్నాడు. పక్కనే ఉన్న నీళ్ల బకెట్‌లో బంతి పడిపోయింది.
కుటుంబసభ్యులంతా తమ పనుల్లో నిమగ్నమై ఉండగా బంతిని తీసుకునేందుకు బకెట్ లోని బంతిని తీసుకునేందుకు శివ ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తూ చిన్నారి తలకిందులుగా అందులో పడిపోయాడు. అరగంట తర్వాత శివ కోసం కుటుంబసభ్యులు వెతుకుతుండగా బకెట్‌లో విగత జీవిగా కనిపించాడు. చిన్నారి మృతదేహాం వద్ద తల్లిదండ్రులు విలపించడాన్ని చూసిన చుట్టుపక్కల వారిని ఈ ఘటన కంటతడి పెట్టించింది.