
ఎంజీఎం/వరంగల్:ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగులను కాపాడాల్సిన వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పేషెంట్ పరిస్థితి సీరియస్‌గా ఉంది.. చూడండి సార్ అంటూ బాధితురాలి బంధువు ప్రాథేయపడినా కనికరించలేదు. ‘‘చివరి దశలో ఉంది. ఏం చికిత్స చేస్తాం’ అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. అయితే.. సకాలంలో వైద్యం అందక కరోనా బాధితురాలు మృతి చెందింది. ఈ ఘటన ఆదివారం వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని ఎంజీఎం ఆస్పత్రిలో చోటుచేసుకుంది.
ధర్మసాగర్ మండలం నారాయణగిరికి చెందిన లింగోజు ఉమ (60)కు కరోనా లక్షణాలు ఉండటంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమంగా మారడంతో ఆదివారం కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరిస్థితి బాగోలేదు వెంటనే చికిత్స అందించాలని బాధితురాలి బంధువు రామకృష్ణ డ్యూటీ డాక్టర్లను ప్రాథేయపడ్డాడు. ‘చివరి దశలో ఉంది.. చేసేదేమీ లేదు’ అంటూ డ్యూటీ డాక్టర్లు అనడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. విషయాన్ని రామకృష్ణ తనకు తెలిసిన వారితో ఎంజీఎం పరిపాలనాధికారుల దృష్టికి తీసుకెళ్లే సరికి ఆమె తుదిశ్వాస విడిచింది.
చదవండి: సుత్తితో మోది..పొలంలో కాల్చేసి..
Comments
Please login to add a commentAdd a comment