వరంగల్: ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దిక్కు వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రి. అలాంటి ఈ ఆస్పత్రిలో 800 పడకలతో కరోనా బాధితులకు చికిత్స చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నా, వాస్తవ పరిస్థితులు మాత్రం విరుద్ధంగా ఉన్నాయి. కోవిడ్ వార్డు లో చికిత్స పొందుతున్న వారిలో ఎవరైనా మృతి చెందితే తప్ప కొత్త వారికి బెడ్ దొరకడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. వరంగల్ కాశిబుగ్గకు చెందిన ఓ మహిళకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురుకాగా, కుటుంబ సభ్యులు ఆమెను ఎంజీఎంకు తీసుకొచ్చారు.
అక్కడి ఆర్‌ఎంఓ, సిబ్బందికి తమ సమస్య చెప్పినా వారెవరూ పట్టించుకోలేదు. పడకలు ఖాళీగా ఉన్నా, ఫ్లో మీటర్లు లేనందున ఆక్సిజన్ పెట్టలేమని తేల్చిచెప్పారు. దీంతో ఆ మహిళ గంటల తరబడి వార్డు బయటే వేచి ఉన్నారు. ఎలాగైనా ఆక్సిజన్ పెట్టాలని ఆమె కుటుంబ సభ్యులు సిబ్బందిని కోరుతున్న క్రమంలోనే, అప్పటికే చికిత్స పొందుతున్న ఓ బాధితుడు మృతి చెందాడు. దీంతో మళ్లీ సిబ్బందిని బతిమిలాడగా, అప్పుడు ఆ మహిళకు బెడ్‌ను కేటాయించి చికిత్స ప్రారంభించారు.
చదవండి: ఇలా ఐతే.. వైద్యం ఎలా ?
Comments
Please login to add a commentAdd a comment