sampu
-
Miyapur: బ్రష్ చేస్తుండగా మూర్ఛ.. సంపులో పడి యువతి మృతి
సాక్షి, మియాపూర్: ఓ యువతికి మూర్ఛరావడంతో సంపులో పడి మృతిచెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ గిరీష్ తెలిపిన మేరకు.. సూర్యాపేట జిల్లా గాం«దీనగర్‌లోని బాచనాయక్‌తండాకు చెందిన లునావత్ నిర్మల(26) మియాపూర్‌లోని మయూరినగర్ స్వదర్ గృహ అనాథాశ్రమంలో ఉంటుంది. నిర్మల మూర్చవ్యాధితో బాధపడుతుండేది. సోమవారం ఉదయం బ్రష్ చేసుకుంటూ ఉండగా మూర్ఛ రావడంతో అనాథాశ్రమ ప్రాంగణంలో ఉన్న సంపులో పడిపోయింది. ఎవరూ చూడకపోవడంతో అందులో మునిగి మృతిచెందింది. కొద్దిసేపటి తర్వాత నిర్మల అశ్రమంలో కనిపించకపోవడంతో నిర్వాహకులు వెతకగా సంపులో కనిపించింది. బయటకు తీయగా అప్పటికే మృతిచెంది ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని గాందీ ఆసుపత్రికి తరలించారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
నో వ్యాక్సిన్.. ఓన్లీ టాక్సిన్!
‘హృదయ కాలేయం’, ‘ సింగం 123 ’ చిత్రాల కథానాయకుడు సంపూర్ణేశ్ బాబు నటించిన హాస్య భరిత చిత్రం ‘వైరస్’. ‘నో వ్యాక్సిన్ ఓన్లీ టాక్సిన్’ అన్నది ఉపశీర్షిక. గీత్‌షా, నిధిషా కథానాయికలు. ఎస్.ఆర్. కృష్ణ దర్శకత్వంలో సలీం ఎం.డి, శ్రీనివాస్ మంగళ నిర్మించారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. సంపూ కడుపుబ్బా ప్రేక్షకులను నవ్విస్తారు. మర్డర్ మిస్టరీ నేపథ్యం కూడా ఉంటుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం’’ అన్నారు. -
బాలుడిని మింగిన నీటిసంపు
కిష్టాపురం(సత్తుపల్లి రూరల్) : ఆడుకుంటూ వచ్చిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు నీటిసంపులో పడి దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన కిష్టాపురం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ముల్లగిరి వీరేంద్రబాబు, జ్యోతి దంపతులకు కుమార్తె, కొడుకు ఉన్నారు. జ్యోతి ఎదురింట్లో సంపు వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటుండగా.. అక్కడికి ఆడుకుంటూ వచ్చిన జయవర్ధన్(3) ప్రమాదవశాత్తు నీటిసంపులో పడిపోయాడు. వెంటనే గమనించిన తల్లి బాబును బయటకు తీసి.. చుట్టుపక్కల వారిని పిలిచి హుటాహుటిన సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించింది. పరీక్షించిన వైద్యులు అప్పటికే జయవర్ధన్ మృతిచెందాడని తెలిపారు. ఒక్కగానొక్క కొడుకు మృతిచెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. 24ఎస్పిఎల్41 : మృతిచెందిన జయవర్ధన్ -
బర్నింగ్ స్టార్ ‘సంపూ’ సందడి
విజయవాడ(చిట్టినగర్) : బర్నింగ్ స్టార్ సంపూ శనివారం చిట్టినగర్ సెంటర్లోని మహాలక్ష్మీ, పద్మావతి గోదాదేవి సమేత వేంకటేశ్వరస్వామి వార్లను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన సంపూర్ణేష్‌బాబుకు ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు. మహాలక్ష్మీ అమ్మవారిని, పద్మావతి, గోదాదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు రామరత్నమాచార్యులు ఆశీర్వచనం అందచేయగా, ఆలయ కమిటీ చైర్మన్ పోతిన బేసు, కమిటీ సభ్యులు పోతిన సాంబశివరావు దేవస్థాన జ్ఞాపికను అందజేశారు. సంపూర్ణేష్‌బాబు చిట్టినగర్‌కు విచ్చేశారని తెలుసుకున్న మహిళలు, యువతులు ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. సంపూతో సెల్ఫీలు, ఆటోగ్రాపులు తీసుకునేందుకు పోటీ పడ్డారు. గూడెల వెంకటరమణ, కత్తెర ప్రదీప్, భోగవల్లి సన్నయ్యపాత్రుడు, మద్ది సాంబశిరావు, భోగవల్లి శ్రీధర్, బీసీ నాయకులు పోతిన వెంకటమహేష్, శీరం వెంకట్రావులు ఆయన వెంట ఉన్నారు. -
నీటి సంపులోపడి బాలిక మృతి
ఆత్మకూర్(ఎస్): నీటి సంపులో పడి బాలిక మృతిచెందింది. మండలంలో చోటుచేసుకున్న ఈ విషాదకర ఘటన వివరాలు.. కందగట్ల గ్రామానికి చెందిన శ్రీరాముల లింగయ్య–నాగలక్ష్మిల ఏకైక కుమార్తె మానశ్రీ(20) ఇంట్లో ఆడుకుంటోంది. అలానే వెళ్లి ఇంటి ఆవరణలో ఉన్న నీటిసంపులో పడి పోయింది. ఆ సమయంలో ఎవరూ గమనించలేదు. కాసేపటికి కుమార్తె కన్పించకపోవడంతో తల్లిదండ్రి వెతకగా సంపులో శవమై కనిపించింది. కుమార్తె మృతిచెందడంతో ఆ దంపతులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. -
సంపులో పడి బాలుడి మృతి
జీడిమెట్ల: ఇంటి ముందు ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు సంపులో పడి మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని చింతల్ చంద్రానగర్‌లో జరిగింది. వివరాలు.. ఐదేళ్ల నిఖిల్ ఇంటి మందు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సంపులో పడి మృతి చెందాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
హృదయ కాలేయానికి 4 కోట్ల కలెక్షన్లు
కేవలం సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుని వెండితెర మీదకు దూసుకొచ్చిన 'హృదయ కాలేయం' చిన్న సినిమాల్లో రికార్డు సృష్టించే దిశగా దూసుకెళ్తోంది. కేవలం కోటిన్నర రూపాయల ఖర్చుతో రూపొందించిన ఈ సినిమాకు తొలి వారాంతంలోనే దాదాపు 4 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. స్వదేశంతో పాటు అమెరికా లాంటి విదేశాల్లో కూడా ఈ సినిమా విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా అన్నిచోట్లా కలిపి ఈ సినిమాకు రూ. 3.9 కోట్ల వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ అనలిస్టు త్రినాథ్ చెప్పారు. సాధారణంగా అయితే స్పూఫ్‌లు చిత్రపరిశ్రమలో అంతగా వెళ్తాయో లేదో చెప్పలేం గానీ, ఈ సినిమా మాత్రం బాగానే నడిచిందని, మంచి వసూళ్లు సాధిస్తోందని ఆయన అన్నారు. థియేటర్లకు జనం బాగా వస్తుండటంతో శాటిలైట్ హక్కులు కూడా మంచి ధరకు వెళ్లినట్లు ఆయన తెలిపారు. సినిమాలో అందరూ కొత్త నటీనటులే ఉన్నా కూడా ఇంత మంచి విజయం సాధించడం పట్ల త్రినాథ్ సంతోషం వ్యక్తం చేశారు. స్టీవెన్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో 'బర్నింగ్ స్టార్' సంపూర్ణేష్ బాబు ఓ సెన్సేషన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.