నీటి సంపులోపడి బాలిక మృతి
Published Fri, Jul 29 2016 12:36 AM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM
ఆత్మకూర్(ఎస్): నీటి సంపులో పడి బాలిక మృతిచెందింది. మండలంలో చోటుచేసుకున్న ఈ విషాదకర ఘటన వివరాలు.. కందగట్ల గ్రామానికి చెందిన శ్రీరాముల లింగయ్య–నాగలక్ష్మిల ఏకైక కుమార్తె మానశ్రీ(20) ఇంట్లో ఆడుకుంటోంది. అలానే వెళ్లి ఇంటి ఆవరణలో ఉన్న నీటిసంపులో పడి పోయింది. ఆ సమయంలో ఎవరూ గమనించలేదు. కాసేపటికి కుమార్తె కన్పించకపోవడంతో తల్లిదండ్రి వెతకగా సంపులో శవమై కనిపించింది. కుమార్తె మృతిచెందడంతో ఆ దంపతులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.
Advertisement
Advertisement