సాక్షి, హైదరాబాద్: సెల్ఫీ పిచ్చి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. తుమ్మినా..దగ్గినా సెల్ఫీనే అన్నట్టు తయారైంది పరిస్థితి. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా..చివరికి ప్రాణాలు పోతున్నా ఈ విపరీత ధోరణిలో మార్పు రావడంలేదు. సెల్పీ మోజులో ప్రపంచాన్నే మర్చి పోతున్నారు. ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీల కోసం ఎగబడుతూ ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు.
తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందంగా ముస్తాబై బయటకు వచ్చిన యువతి సెల్ఫీ కోసం ప్రయత్నించింది. తన అందాన్ని కెమెరాలో బంధించాలని తాపత్రయ పడిన ఆ అమ్మాయి సమీపంలోని కాలువ ఒడ్డున నిల్చొని సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించింది. చివరకు అదుపు తప్పి బురదలో పడిపోయింది. నవ్వాలో.. చిరాకు పడాలో అర్థం కావడం లేదు. జాలేస్తోంది అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment