Viral Video: Little Girl Helps Old Man Drink Water From Bottle - Sakshi
Sakshi News home page

ఎంత పెద్ద మనసు.. చిన్నారి సాయం చూసి నెటిజన్లు ఫిదా!

Published Fri, Apr 7 2023 7:28 PM | Last Updated on Fri, Apr 7 2023 9:05 PM

Viral Video: Little Girl Helps Old Man Drink Water From Bottle - Sakshi

సోషల్‌ మీడియా వాడకం పెరిగినప్పటీ నుంచి ప్రతి విషయం నిమిషాల్లో ప్రపంచం మొత్తం చుట్టేస్తోంది. ఎక్కడ ఏది జరిగినా అది వెంటనే నెట్టింట ప్రత్యక్ష్యమవుతోంది. ఈ క్రమంలో కొన్ని ఫన్నీ వీడియోలు నవ్వించగా, మరికొన్ని మాత్రం గుండెల‌ను తాకుతూ కంట‌నీరు తెప్పిస్తుంటాయి. వీడియో ఏదైనా కంటెంట్‌కు నెటిజన్లు కనెక్ట్‌ అయితే చాలు అది నెట్టింట వైరల్‌గా మారుతుంది. తాజాగా ఓ చిన్నారి వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ పాప చేసిన పని అందరి చేత శాభాష్‌ అనిపిస్తోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే?

రోడ్డు ప‌క్క‌న ఓ పెద్దాయ‌న పుట్‌పాత్‌పై కూర్చుని ఉంటాడు. ఆయన చేయి వ‌ణుకుతూ ఉండడంతో నీరు తాగేందుకు ఇబ్బంది పడుతుంటాడు. ఇదంతా గమనించిన ఓ చిన్నారి ఆయనకు నీరు తాగించాలని అనుకుంటుంది. బాలిక‌ పెద్దాయ‌న వీపుపై ఒక చేయి వేసి మ‌రో చేతితో బాటిల్ ప‌ట్టుకుని ఆయ‌న‌తో నీరు తాగిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. ఆ బాలిక చూపిన ఔదార్యానికి నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. చిన్నారి చేసిన పనిని అభినందిస్తూ.. ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద మనసు అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement