Classmates Fill Rajasthan Girl Water Bottle With Urine - Sakshi
Sakshi News home page

విద్యార్థిని వాటర్ బాటిల్‌లో మూత్రం కలిపి.. ప్రభుత్వ బడిలో దారుణం..

Published Mon, Jul 31 2023 6:52 PM | Last Updated on Mon, Jul 31 2023 7:11 PM

Classmates Fill Rajasthan Girl Water Bottle With Urine - Sakshi

జైపూర్‌: రాజస్థాన్‌లో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూల్ విద్యార్థులు తమ క్లాస్‌మెట్ బాలిక వాటర్ బాటిల్‌లో యూరిన్ కలిపారు. ఆ విషయం తెలవని బాలిక ఆ నీటిని తాగింది. అంతేకాకుండా ఈ విషయాన్ని తెలుపుతూ రాసిన లవ్‌ లెటర్‌ని కూడా బాలిక తన బ్యాగులో గుర్తించింది. ఈ ఘటనపై స్థానికులు దుండగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిల్వారా జిల్లాలోని లుహారియా గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉంది. పాఠశాలలో లంచ్ బ్రేక్‌లో ఓ విద్యార్థిని తాగే వాటర్ బాటిల్‌లో కొంత మంది విద్యార్థులు మూత్రం కలిపారు. ఆ విషయం తెలియక ఆ బాలిక వాటిని తాగేసింది. దుర్వాసన పసిగట్టిన బాలిక.. తన బ్యాగులో ఉన్న లవ్‌ లెటర్‌లో పేర్కొన్న ఆ విషయాన్ని నిర్ధారించుకుంది. ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినా.. ఆయన సరైన చర్యలేవీ తీసుకోలేదు. 

ఈ వ్యవహారంపై స్థానికులు సోమవారం పాఠశాలకు వెళ్లి ఆందోళన చేశారు. ఆనంతరం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. నిందితులపై సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులపై దాడి చేయడానికి జనం వెళ్లగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో లాఠీఛార్జీ కూడా జరిగింది. ఈ ఘటనలో జనం రాళ్లు రువ్వుకున్నారు.  అయితే.. బాధితులు ఇప్పటికీ ఫిర్యాదు చేయలేదని ఏఎస్‌పీ జ్ఞాణశ్యామ్‌ శర్మ తెలిపారు.

ఇదీ చదవండి: జైపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఘటన: చేతన్‌ షార్ట్ టెంపర్‌.. అందుకే ఈ ఘోరం!

     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement