హృదయ కాలేయానికి 4 కోట్ల కలెక్షన్లు | Hrudaya Kaleyam mints gold at the box office | Sakshi
Sakshi News home page

హృదయ కాలేయానికి 4 కోట్ల కలెక్షన్లు

Published Mon, Apr 7 2014 1:56 PM | Last Updated on Sat, Sep 2 2017 5:42 AM

హృదయ కాలేయానికి 4 కోట్ల కలెక్షన్లు

హృదయ కాలేయానికి 4 కోట్ల కలెక్షన్లు

కేవలం సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుని వెండితెర మీదకు దూసుకొచ్చిన 'హృదయ కాలేయం' చిన్న సినిమాల్లో రికార్డు సృష్టించే దిశగా దూసుకెళ్తోంది. కేవలం కోటిన్నర రూపాయల ఖర్చుతో రూపొందించిన ఈ సినిమాకు తొలి వారాంతంలోనే దాదాపు 4 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. స్వదేశంతో పాటు అమెరికా లాంటి విదేశాల్లో కూడా ఈ సినిమా విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా అన్నిచోట్లా కలిపి ఈ సినిమాకు రూ. 3.9 కోట్ల వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ అనలిస్టు త్రినాథ్ చెప్పారు. సాధారణంగా అయితే స్పూఫ్లు చిత్రపరిశ్రమలో అంతగా వెళ్తాయో లేదో చెప్పలేం గానీ, ఈ సినిమా మాత్రం బాగానే నడిచిందని, మంచి వసూళ్లు సాధిస్తోందని ఆయన అన్నారు.

థియేటర్లకు జనం బాగా వస్తుండటంతో శాటిలైట్ హక్కులు కూడా మంచి ధరకు వెళ్లినట్లు ఆయన తెలిపారు. సినిమాలో అందరూ కొత్త నటీనటులే ఉన్నా కూడా ఇంత మంచి విజయం సాధించడం పట్ల త్రినాథ్ సంతోషం వ్యక్తం చేశారు. స్టీవెన్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో 'బర్నింగ్ స్టార్' సంపూర్ణేష్ బాబు ఓ సెన్సేషన్గా నిలిచిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement