సంపూ రికార్డ్‌ | Sampoornesh Babu About Dialogue In Kobbari Matta | Sakshi
Sakshi News home page

సంపూ రికార్డ్‌

Published Tue, Jul 30 2019 5:50 AM | Last Updated on Tue, Jul 30 2019 5:50 AM

Sampoornesh Babu About Dialogue In Kobbari Matta - Sakshi

‘హుృదయకాలేయం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచి, ‘బర్నింగ్‌ స్టార్‌’గా పేరు తెచ్చుకున్న సంపూర్ణేష్‌ బాబు నటించిన తాజా చిత్రం ‘కొబ్బరిమట్ట’. రూపక్‌ రొనాల్డ్‌ సన్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సాయి రాజేష్‌ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 10న విడుదలకానుంది. ఈ సందర్భంగా  – ‘‘ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారిగా 3.30 నిమిషాల సింగిల్‌ షాట్‌ డైలాగ్‌ ఉన్న సినిమా ‘కొబ్బరిమట్ట’’ అంటూ పెద్ద డైలాగ్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్రబృందం.

‘‘ఏరా పెదరాయుడు.. త్రికాలాత్రక.. ఓరీ ఓరోరీ ఆపరా..’ అంటూ మొదలైన సంపూర్ణేష్‌ డైలాగ్‌.. ‘పెదరాయుడు టైమ్‌ ఈజ్‌ ఓవర్‌.. ఆండ్రాయుడు టైమ్‌ స్టార్ట్స్‌ నౌ..’ అనే డైలాగ్‌తో ముగుస్తుంది.3.30 నిమిషాలపాటు సంపూ చెప్పిన ఈ డైలాగ్‌కి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో పాపారాయుడు, పెదరాయుడు, ఆండ్రాయుడు.. లాంటి మూడు పాత్రలతో సంపూ మెప్పించబోతున్నారు. అత్యంత భారీ డైలాగ్‌లు చెప్పి లిమ్కా బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుని నెలకొల్పాడు. ఇటీవల విడుదల చేసిన ‘అఆ.. ఇఈ...’ అనే పాటకి యూట్యూబ్‌లో 24 గంటల్లో రెండు లక్షల వ్యూస్‌ వచ్చాయంటే మా సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌ తెలియజేస్తోంది. ఈ చిత్రం నైజాం, ఓవర్‌సీస్‌ హక్కులని ‘నో బారియర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ వారు సొంతం చేసుకున్నారు’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement