Kobbari matta
-
కొబ్బరి మట్టకు ఐదేళ్లు పట్టలేదు
‘‘ఒక వ్యక్తికి సినిమా పట్ల ఎంత ప్యాషన్ ఉంటుందో సాయి రాజేష్‌ని చూసి తెలుసుకోవచ్చు. మట్టి నుండి తెచ్చిన వినాయకుడి విగ్రహాన్ని మనం పూజిస్తామో.. అలా మట్టిలో నుంచి సంపూని తెచ్చి ఒక స్టార్‌ని చేయడానికి చాలా కష్టపడుతున్నారు. సంపూ ఎంత పెద్ద నటుడు అనేది ఆల్రెడీ ప్రూవ్ అయింది’’ అని డైరెక్టర్ మారుతి అన్నారు. సంపూర్ణేష్ బాబు హీరోగా రూపక్ రొనాల్డ్ సన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొబ్బరిమట్ట’. సాయి రాజేష్ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నిర్మాత ‘మధుర’ శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘సంపూర్ణేష్ సినిమాలంటే చాలా ఇష్టం. ఈ సినిమా టీజర్, ట్రైలర్ చూశాక మళ్లీ మళ్లీ చూడాలనిపించే కథ అనిపించింది. అందుకే ఉదయం 8:45 గంటల ఆటకి టికెట్ బుక్ చేసుకున్నాను’’ అన్నారు. ‘‘జంధ్యాల, ఈవీవీగార్ల వినోదం తర్వాత సాయిరాజేశ్ కామెడీ నాకు నచ్చుతుంది. రాజేష్, సంపూగారివల్లే ఈ సినిమా చేశాను’’ అన్నారు రూపక్ రొనాల్డ్ సన్. ‘‘ఈ సినిమా కోసం నేను, సంపు, రూపక్.. మా కెరీర్లను వదులుకుని మరీ చేశాం. ‘కొబ్బరిమట్ట’ ఐదేళ్లు చేశామని అంటున్నారు, కానీ మేం షూటింగ్ చేసింది 39 రోజులు మాత్రమే’’ అన్నారు సాయి రాజేశ్. ‘‘నిజాయతీతో సినిమా చేసిన టీమ్ ఇది. తప్పకుండా సినిమా చూడండి’’ అన్నారు హీరో సందీప్ కిషన్. ‘‘ఈ సినిమాలో భాగం అయినందుకు గర్వంగా ఉంది’’ అన్నారు నటి షకీలా. సంపూర్ణేశ్ బాబు, నటులు శివ బాలాజీ, సమీర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ నలుగురు లేకుంటే కొబ్బరిమట్ట లేదు
‘హృదయ కాలేయం’ ఫేమ్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘కొబ్బరిమట్ట’. రూపక్ రొనాల్డ్ సన్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సాయి రాజేష్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 10న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. రోనాల్డ్ సన్ మాట్లాడుతూ– ‘‘హృదయకాలేయం’ విడుదల సమయంలో కొన్ని ఇబ్బందులు పడ్డాం. ఎవరీ హీరో.. మార్కెట్ అవుతుందా? అనే ప్రశ్నలతో వ్యాపారం మందకొడిగా సాగింది. విడుదల తర్వాత ఆ సినిమాకి మంచి పేరు వచ్చింది. ‘కొబ్బరిమట్ట’ చిత్రాన్ని ‘బాహుబలి’ తరహాలో ఐదేళ్లు తీశాం. ప్రమోషన్లో భాగంగా ఒక్కో ట్రైలర్ విడుదల చేయగా సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇండస్ట్రీలో ఆ నలుగురు వల్లే మా చిత్రం నిలబడింది. గీతా ఆర్ట్స్ సంస్థ ద్వారా మా చిత్రం విడుదలకాబోతుంది. నైజాంలో ‘దిల్’ రాజుగారు విడుదల చేస్తున్నారు. ఆ నలుగురు లేనిదే ‘కొబ్బరిమట్ట’ లేదు. కథ బాగుంటే విడుదలకు సహకరిస్తారనేందుకు మా చిత్రమే నిదర్శనం’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో మూడు పాత్రలు పోషించాను. యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ , రొమాన్స్, సందేశం.. ఇలా అన్ని అంశాలు మా సినిమాలో ఉంటాయి’’ అన్నారు సంపూర్ణేష్‌బాబు. ‘‘నాలుగేళ్ల ప్రయాణం మా చిత్రం. గీతా ఆర్ట్స్ సహకారంతో చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. మా సినిమాకి ఇప్పటికే టికెట్స్ బుకింగ్ 80శాతం పూర్తయ్యాయి’’ అన్నారు సాయిరాజేష్. నిర్మాత ఎస్కె.ఎన్, కత్తి మహేష్, ఏలూరు శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
సంపూ రికార్డ్
‘హుృదయకాలేయం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచి, ‘బర్నింగ్ స్టార్’గా పేరు తెచ్చుకున్న సంపూర్ణేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘కొబ్బరిమట్ట’. రూపక్ రొనాల్డ్ సన్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సాయి రాజేష్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 10న విడుదలకానుంది. ఈ సందర్భంగా – ‘‘ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారిగా 3.30 నిమిషాల సింగిల్ షాట్ డైలాగ్ ఉన్న సినిమా ‘కొబ్బరిమట్ట’’ అంటూ పెద్ద డైలాగ్ ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్రబృందం. ‘‘ఏరా పెదరాయుడు.. త్రికాలాత్రక.. ఓరీ ఓరోరీ ఆపరా..’ అంటూ మొదలైన సంపూర్ణేష్ డైలాగ్.. ‘పెదరాయుడు టైమ్ ఈజ్ ఓవర్.. ఆండ్రాయుడు టైమ్ స్టార్ట్స్ నౌ..’ అనే డైలాగ్‌తో ముగుస్తుంది.3.30 నిమిషాలపాటు సంపూ చెప్పిన ఈ డైలాగ్‌కి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో పాపారాయుడు, పెదరాయుడు, ఆండ్రాయుడు.. లాంటి మూడు పాత్రలతో సంపూ మెప్పించబోతున్నారు. అత్యంత భారీ డైలాగ్‌లు చెప్పి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుని నెలకొల్పాడు. ఇటీవల విడుదల చేసిన ‘అఆ.. ఇఈ...’ అనే పాటకి యూట్యూబ్‌లో 24 గంటల్లో రెండు లక్షల వ్యూస్ వచ్చాయంటే మా సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ తెలియజేస్తోంది. ఈ చిత్రం నైజాం, ఓవర్సీస్ హక్కులని ‘నో బారియర్స్ ఎంటర్టైన్మెంట్’ వారు సొంతం చేసుకున్నారు’’ అన్నారు. -
సంపూ ట్వీట్.. నవ్వులే నవ్వులు
హృదయ కాలేయం సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు తాజా చిత్రం కొబ్బరి మట్ట. రూపక్ రొనాల్డ్ దర్శకత్వంలో స్టీవెన్ శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 10న విడుదల చేస్తున్నట్టు సంపూ ప్రకటించారు. ఆగస్ట్ 9న కింగ్ నాగార్జున ‘మన్మథుడు-2’విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, రాహుల్ రవీంద్రన్‌లను ట్యాగ్ చేస్తూ సంపూ చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ‘మా సినిమా ఆగస్ట్ 10న విడుదల కాబోతుంది. నాగార్జున సర్, రాహుల్ సర్, రకుల్ గారు, వెన్నెల కిశోర్ గార్ల ఆశీర్వాదాలు కావాలి. మీ సినిమా హౌస్‌ఫుల్ అయి, టికెట్లు దొరకక మా సినిమాకు రావాలని కోరుకుంటున్నాము. మీ సంపూర్ణేష్ బాబు’అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు కామెడీగా స్పందిస్తున్నారు. ఇక సంపూ ట్వీట్‌పై దర్శకుడు రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిశోర్‌లు తమదైన రీతిలో స్పందించారు. ‘హహహ తథాస్తు సంపూ గారు, ఆల్ ద బెస్ట్’అంటూ రాహుల్ పేర్కొనగా.. ‘ఐదు వేళ్లలాంటి మనకు నాలుగు బ్రష్‌లు అవసరం లేనప్పుడు, మన రెండు సినిమాలకు ఏంటన్నా. లవ్ అండ్ కేరింగ్‌కు లవ్ యూ’అంటూ వెన్నెల కిశోర్ ట్వీట్ చేశాడు. ఇక ఈ సినిమా ఎపుడో విడుదల కావాల్సి ఉన్న ఫైనాల్షియల్ ప్రాబ్లెమ్స్‌తో విడుదల కాలేదు. తాజాగా ఈ సినిమా రిలీజ్‌కున్న అడ్డంకులు తొలగడంతో ఆగస్ట్ 10న విడుదల చేస్తున్నారు. We are releasing on August 10th. Need blessings from King @iamnagarjuna sir, @23_rahulr sir, @Rakulpreet garu and @vennelakishore anna garu. Mee cinema housefulls ayi, tickets dorakka maa cinema ki ravalani korukuntunnanu. Mee Sampoornesh babu#KobbariMattaOnAug10 pic.twitter.com/O8hl8SgrIC — Sampoornesh Babu (@sampoornesh) July 26, 2019 -
‘సంపూ’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే!
హృదయ కాలేయం సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన కామెడీ నటుడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. సోషల్ మీడియా ప్రమోషన్లో సరికొత్త ట్రెండ్ సృష్టించిన సంపూ, తరువాత ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. హీరోగా నటించిన సింగం 123తో పాటు కామెడీ రోల్స్ కూడా పెద్దగా క్లిక్ కాకపోవటంతో అవకాశాలు తగ్గిపోయాయి. సంపూ మంచి ఫాంలో ఉండగానే కొబ్బరి మట్ట పేరుతో ఓ సినిమాను ఎనౌన్స్ చేశారు. పోస్టర్లు, టీజర్లతో బాగానే హడావిడి చేశాడు. కానీ తరువాత ఆ సినిమా గురించి ఆడియన్స్ మర్చిపోయారు. అప్పుడప్పుడు పోస్టర్స్ రిలీజ్ చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. తాజాగా ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతుందని మరో పోస్టర్ రిలీజ్ చేశాడు సంపూ. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను జూన్ 20న ఉదయం 9 గంటలకు ప్రకటించనున్నాట్టుగా తెలిపాడు. రూపక్ రొనాల్డ్ దర్శకత్వంలో స్టీవెన్ శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు మూడు విభిన్న పాత్రల్లో అలరించనున్నాడు. మరి ఈ సినిమా బర్నింగ్ స్టార్‌కు తిరిగి పూర్వ వైభవం తీసుకువస్తుందేమో చూడాలి. Vasthunnaaam...#KOBBARIMATTA pic.twitter.com/JYLrny7HGB — Sampoornesh Babu (@sampoornesh) 18 June 2019 -
ఇంద్రకీలాద్రిపై సంపూ
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ) : సినీ హీరో సంపూర్ణేష్ బాబు ఆదివారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన సంపూర్ణేష్‌బాబును ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న సంపూర్ణేష్‌బాబు తన నటించిన నూతన చిత్రం కొబ్బరి మట్ట విజయవంతం కావాలని అమ్మవారికి మొక్కుకున్నారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన సంపూర్ణేష్‌బాబుతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు పలువురు భక్తులు ఉత్సాహం చూపించారు. కొంత మంది భక్తులు సంపూ మొదటి చిత్రమైన హృదయకాలేయం గురించి మాట్లాడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. -
ఒక్కరు కాదు ముగ్గురు
‘హృదయ కాలేయం’ ఫేమ్ సంపూర్ణేష్ బాబు హీరోగా రూపక్ రొనాల్డ్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొబ్బరిమట్ట’. ఇషికా సింగ్, గీతాంజలి కథానాయికలు. ఆది కుంభగిరి, సాయిరాజేష్ నీలం నిర్మించిన ఈ సినిమా నవంబర్ 14న విడుదలవుతోంది. ఈ చిత్రం సాంగ్ టీజర్‌ను ‘బిగ్ బాస్ 1’ కంటెస్టెంట్ల మధ్య హైదరాబాద్‌లో విడుదల చేశారు. డైరెక్టర్ రూపక్ రొనాల్డ్సన్ మాట్లాడుతూ– ‘‘కొబ్బరిమట్ట’ చిత్రం ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఒక సంపూర్ణేష్ని చూస్తేనే కామెడీ ఎంత ఉంటుందో చెప్పక్కర్లేదు. ఇందులో ముగ్గురు సంపూర్ణేష్లుంటారు’’ అన్నారు. ‘‘కొబ్బరిమట్ట’ సినిమా రిలీజ్ రోజున సంపూర్ణేష్‌బాబు, సాయిరాజేశ్‌తో ‘సంపూ ఇన్ అమెరికా’ అని ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు చిత్ర సమర్పకుడు కృష్ణారావు.‘‘హృదయ కాలేయం’ సినిమా టైమ్‌లో మేం ఎదగాలని అందరూ సపోర్ట్ చేశారు. అయితే ‘కొబ్బరిమట్ట’ చిత్రానికి మూడేళ్ల పాటు చాలా సమస్యలు ఎదుర్కొని అధిగమించాం’’ అన్నారు నిర్మాత సాయి రాజేష్. ‘‘మిట్టపల్లె అనే చిన్న ఊరు నుంచి నన్ను తీసుకొచ్చి రాజేష్ అన్న ‘హృదయ కాలేయం’ సినిమా చేశాడు. ఇప్పుడు ‘కొబ్బరి మట్ట’ సినిమాకి కూడా తనే నిర్మాత. ఆయన వెనక నిలబడి ఎన్ని రోజులైనా సపోర్ట్ అందిస్తాను’’ అన్నారు సంపూర్ణేష్ బాబు. భరత్, అజయ్, కత్తి కార్తీక, సమీర్, ముమైత్ ఖాన్, మధుప్రియ, రైటర్ కిట్టు, అనురాగ్, సౌమ్య వేణుగోపాల్, శ్రవణ్, సాయిబాలాజీ, ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
‘కొబ్బరి మట్ట’పై కొత్త అప్డేట్
హృదయ కాలేయం సినిమాతో సెన్సేషన్ సృష్టించిన సంపూర్ణేష్ బాబు తరువాత హీరోగా నటిస్తూనే సహాయ పాత్రల్లోనూ నటిస్తున్నాడు. దాదాపు ఏడాదిన్నర క్రితం సంపూర్ణేష్ బాబు హీరోగా కొబ్బరిమట్ట సినిమా ప్రారంభమైంది. అయితే వివిధ కారణాలతో ఆలస్యమైన ఈ సినిమా ఫైనల్‌గా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని హీరో సంపూర్ణేష్ బాబు, దర్శకుడు రాజేష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘ఫైనల్ గా సినిమా పూర్తయ్యింది. సంవత్సరమున్నర కష్టం.... కష్టం అనేది చిన్న మాట.. ఈ సినిమా నిర్మాణం కోసం రక్తం, చెమట, కన్నీళ్లు ధారాపోశాం. ఎలాంటి క్రియేటివ్ పబ్లిసిటీ చేస్తే జనం దగ్గరకి ఈ సినిమా తీసుకెళ్తాను అనేది ఇప్పుడు బుర్రలో ప్రతి క్షణం తొలుస్తున్న ఆలోచన. ప్రతి బ్యాచిలర్ కొంపలో మందు సిట్టింగ్ కి బెస్ట్ స్టఫ్ ‘కొబ్బరిమట్ట’ అవబోతోంది. ఒక కొత్త రకమైన, అదేదో రకమైన సినిమాని చూసి నవ్వుకోబోతున్నారు. మీ ప్రేమ, సపోర్ట్ కావాలి. షేర్లు, లైకులు చేస్తారు. ఎందుకంటే బేసిక్ గా మీరు మంచోరు’ అంటూ ట్వీట్ చేశారు. Finally....We are Ready....సంవత్సరమున్నర కష్టం.... కష్టం అనేది చిన్న మాట.... I poured my blood, sweat and tears to produce this film... Get ready for the release date...#KobbariMatta @sairazesh @RonaldsonRupak pic.twitter.com/Jc8ZvPQout — Sampoornesh Babu (@sampoornesh) 2 July 2018 Finally....We are Ready....సంవత్సరమున్నర కష్టం.... కష్టం అనేది చిన్న మాట.... I poured my blood, sweat and tears to produce this film... ఎలాంటి క్రియేటివ్ PUBLICITY ఎలా చేస్తే జనం దగ్గరకి ఈ సినిమా తీసుకెళ్తాను అనేది ఇప్పుడు బుర్రలో ప్రతి క్షణం తొలుస్తున్న ఆలోచన... pic.twitter.com/StOiOsS7tn — Sai Rajesh (@sairazesh) 2 July 2018 -
సంపూ సినిమాకు 233 కోట్ల కలెక్షన్లు..
హైదరాబాద్: వేటాడే ముందు వెనకడుగేసిన సింహంలా.. కొన్నాళ్లపాటు ప్రచారానికి దూరంగా సంపూర్ణేశ్ బాబు మళ్లీ జూలు విదిల్చాడు. బిగ్‌బాస్ షో తర్వాత దాదాపు కనిపించకుండాపోయిన ఈ ‘బర్నింగ్ స్టార్’ .. బాక్సాఫీస్ వద్ద సత్తా చూపించాడు. తన తాజ చిత్రం ‘కొబ్బరిమట్ట’ తొలివారం ఏకంగా రూ.233.64 కోట్ల కలెక్లన్లు సాధించాడు. ‘అదేంటి? అసలా సినిమా రిలీజైందా?’ అనేకదా మీ డౌట్! నిజమే, సినిమా విడుదలైన తర్వాత కలెక్షన్లు చెబితే అతను సంపూ ఎందుకవుతాడు? బాబుకు బర్త్‌డే గిఫ్ట్: ‘హృదయ కాలేయం’తో ప్రేక్షకుల ప్రేమకు సదా బానిసగా మారిన సంపూ.. ఎప్పుడో నాలుగేళ్ల కిందట మొదలుపెట్టిందే కొబ్బరిమట్ట సినిమా. రకరకాల కారణాలతో వాయిదాపడుతూ వచ్చిన ఈ స్ఫూఫ్ యాక్షన్ కామెడీని ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాతలు రెడీ అయ్యారు. బుధవారం సంపూర్ణేశ్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని కొబ్బరిమట్ట యూనిట్ కొత్త పోస్టర్‌ను విడుదలచేశారు. అందులో ‘233.64 కోట్లు.. ఫస్ట్ వీక్ ఎక్స్పెక్టెడ్ గ్రాస్’ అని పేర్కొన్నారు. -
సంపూర్జేష్బాబు ఫస్ట్ లుక్
-
మహేష్‌కు పోటీగా మరో స్టార్..!
సూపర్ స్టార్ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ప్రకటన వచ్చేసింది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మహేష్, మురుగదాస్‌ల సినిమా ఫస్ట్ లుక్‌ను ఏప్రిల్ 12న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేయటంలో మురుగదాస్‌కు మంచి రికార్డ్ ఉంది. ముఖ్యంగా మురుగదాస్ సినిమాల టీజర్లు సంచలనాలు నమోదు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. The Countdown Begins!Mark your Calendar!!Set your Time!!#Mahesh23 #ARM11 #FirstLook12Apr17@5pm @ARMurugadoss @urstrulyMahesh — NVR Cinema (@NVRCinema) 10 April 2017 అయితే ఇంతటి భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న సూపర్ స్టార్ టీజర్‌కు పోటిగా మరో స్టార్ తన సినిమా టీజర్‌ను రిలీజ్ చేస్తున్నాడు. అదే రోజు అదే సమయానికి బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కొత్త సినిమా 'కొబ్బరి మట్ట' సాంగ్ టీజర్ రిలీజ్ చేస్తున్నారు. సంపూర్ణేష్ బాబు మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో పాపరాయుడు సాంగ్ టీజర్ ను ఏప్రిల్ 12న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తున్నటుగా చిత్రయూనిట్ ప్రకటించారు. -
కోలీవుడ్‌కి సంపూ సినిమా
ఆన్లైన్ సెన్సెషన్‌గా వెండితెర మీదకు ఎంట్రీ ఇచ్చి, తొలి సినిమాతోనే బీభత్సమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్న స్టార్, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. హృదయకాలేయం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంపూ తరువాత పలు చిత్రాల్లో అతిథి పాత్రలతోనూ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం కొబ్బరిమట్ట సినిమాలో త్రిపాత్రాభియం చేస్తున్నాడు. పాపరాయుడు, పెదరాయుడు, ఆండ్రాయిడు అనే మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తున్నాడు సంపూ. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాను తమిళ్లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కోలీవుడ్‌లో స్టార్ కమెడియన్ ఒకరు ఈ సినిమా రైట్స్ కోసం ట్రై చేస్తున్నారు. భారీ మొత్తం చెల్లించి రైట్స్ సొంతం చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. సంజన మూవీస్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్లో డిస్ట్రిబ్యూట్ చేయనున్నారన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు తొలిసారి సంపూర్ణేష్ సినిమాను ఓవర్సీస్లోనూ మిడ్ వెస్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా భారీగా రిలీజ్ చేస్తున్నారు. -
పెదరాయుడిగా సంపూర్ణేశ్
హైదరాబాద్: సంపూర్ణేశ్ బాబు.. ఈ పేరు పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. హృదయకాలేయం చిత్రంతో విలక్షణ నటన కనబరిచి అభిమానులను కుప్పలుగా సంపాదించుకుని బర్నింగ్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తిరిగి అదే టీంతో చేస్తున్న చిత్రం 'కొబ్బరి మట్ట'. ఈ చిత్ర టీజర్ సోమవారం సాయంత్రం విడుదల చేశారు. రుపక్ రోనాల్డ్స్న్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంపూర్ణేశ్ బాబు గతంలో బడా హీరోలు చేసిన పాత్రలను అనుకరించినట్లు కనిపిస్తోంది. ఈ చిత్రంలో మూడు పాత్రల్లో ఆయన కనిపిస్తున్నారట. ముఖ్యంగా తాజాగా విడుదల చేసిన ట్రైలర్లో ఆయన పెద రాయుడిలా కనిపించారు. అప్పటి పెద రాయుడు చిత్రంలో మోహనబాబు ఎలాంటి వేషధారణలో కనిపించారో అచ్చం అలాగే. ఒక మహిళను కొడుతుండగా.. ఎంట్రీ ఇచ్చిన మహిళల గొప్పతనం ఏమిటో ఓ భారీ డైలాగ్‌లో గుక్క తిప్పుకోకుండా కనిపించారు సంపూర్ణేష్. ఈ డైలాగ్ పూర్తవడంతోనే ట్రైలర్ కూడా ముగిసిపోతుంది. అన్నట్లు ఈ చిత్రంలో బాహుబలి స్ఫూప్ కూడా ఉందంట. -
పాపారాయుడు..పెద్దరాయుడు..ఆండ్రాయుడు..
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్) : 'హృదయ కాలేయం' సినిమా హీరో సంపూర్ణేష్ బాబు తన తదుపరి చిత్రం 'కొబ్బరిమట్ట' విశేషాలను విలేకరులతో పంచుకున్నారు. కొబ్బరిమట్టలో త్రిపాత్రాభినయం చేస్తున్నానని.. ఇందులో తాను పాపారాయుడు, పెద్ద రాయుడు, ఆండ్రాయుడు పాత్రలతో అలరించనున్నట్లు చెప్పారు. దసరా పండక్కి రాబోతున్న 'కొబ్బరిమట్ట' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతానని సంపూర్ణేష్ బాబు అన్నారు. సికింద్రాబాద్ సోమసుందరం వీధిలోని కొత్త ఎల్లయ్య మెమోరియల్ హైస్కూల్లో శనివారం జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి హాజరైన ఆయన కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. ఈ సినిమాలో ఏడుగురు హీరోయిన్లు ఉండటం ప్రత్యేకత అన్నారు. ఉమ్మడి కుటుంబంలో ఉండే బంధాలు, అనుబంధాలతో పాటు కామెడీ కూడా ప్రధానంగా కనిపిస్తుందని చెప్పారు. హృదయ కాలేయం, సింగం 123 చిత్రాలతో చాలా మంది అభిమానుల్ని సంపాదించుకున్నానని.. ఇప్పుడు ఈ చిత్రాన్ని ప్రేక్షకులు మరింత ఆదరిస్తారనే విశ్వాసాన్ని సంపూర్ణేష్ వ్యక్తం చేశారు. దసరా పండుగకు ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఒకేసారి మూడు పాత్రల్లో కనిపించడం తనకు ఎంతో థ్రిల్లింగ్‌గా ఉందని ఈ సందర్భంగా సంపు అన్నారు. -
సంపూర్ణేష్ కొత్తచిత్రం ’కొబ్బరిమట్ట’ప్రారంభం
-
కోలీవుడ్‌లో సంపూకి బంపర్ ఆఫర్
-
'త్రిపాత్రాభినయం థ్రిల్లింగ్‌గా ఉంది'
కరీంనగర్ : త్వరలో విడుదల కానున్న కొబ్బరిమట్ట సీనిమాలో త్రిపాత్రాభినయం చేయడం థ్రిల్లింగ్‌గా ఉందని ‘హృదయకాలేయం’ ఫేం హీరో సంపూర్ణేష్‌బాబు అన్నారు. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్లకు చెందిన చింతోజు ఈష్‌కుమార్‌ను కలిసి వేడుకలు చేసుకోవడానికి శనివారం ఆయన కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లకు వచ్చారు. ప్రస్తుతం ఐదు సినిమాల్లో నడిస్తున్నట్లు తెలిపారు. మూడింటిలో అతిథి పాత్ర.. రెండింటిలో హీరోగా చేస్తున్నట్లు వెల్లడించారు. రూపక్ దర్శకత్వంలో వస్తున్న కొబ్బరి మట్టలో తాను పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయిడు అనే విభిన్న పాత్రల్లో కనిపిస్తానని తెలిపారు. మొదట సినిమాల్లో వేషాలకోసం పడరాని పాట్లు పడ్డానని, ఎందరినుంచో విమర్శలు ఎదుర్కొన్నానని అప్పుడే విమర్శకులకు సరైన సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకుని చాలెంజ్‌గా తీసుకున్నానన్నారు. కొత్త ఆర్టిస్టులకు అవకాశం వచ్చేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. స్నేహబంధం గొప్పదని పేర్కొంటూ..స్నేహితుల రోజు శుభాకాంక్షలు తెలిపారు. డివిజన్ స్వచ్ఛంద సంస్థల అధ్యక్షుడు చింతోజు భాస్కర్ సంపూర్ణేష్‌బాబును మెమోంటోతో సత్కరించారు. -
సంపూ సరసన ఏడుగురు హీరోయిన్లు!
'హృదయ కాలేయం' చిత్రం విడుదలకు ముందే సంపూర్ణేష్ బాబు అలియాస్ సంపూని సోషల్ మీడియా హీరో చేసింది. సోషల్ మీడియా అందించిన ఊపుతో విడుదలైన 'హృదయ కాలేయం' చిత్రం భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. హృదయ కాలేయం చిత్ర అందించిన విజయంతో నిర్మాత సాయి రాజేష్ కొబ్బరి మట్ట చిత్రాన్ని ప్రారంభించారు. హృదయ కాలేయం చిత్రం విడుదల రోజున 'కొబ్బరి మట్ట' చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. కొబ్బరి మట్ట చిత్ర ఫస్ట్ లుక్ కు మంచి స్పందనే వచ్చింది. అయితే కొబ్బరి మట్ట చిత్రాన్ని క్రేజీ ప్రాజెక్ట్ గా మలిచేందుకు నిర్మాతలు సిద్దమవుతున్నారు. సంపూ సరసన ఏడుగురు హీరోయిన్లు నటించనున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రంలో పాపారాయుడు, పెదరాయుడు, అండ్రాయుడు అనే మూడు విభిన్న పాత్రలను సంపూ పోషిస్తున్నారు. ఇన్ని ప్రత్యేకతలతో రూపొందే చిత్రం 'కొబ్బరిమట్ట' హిట్ సాధిస్తుందో లేదో చూడాలి.