'త్రిపాత్రాభినయం థ్రిల్లింగ్‌గా ఉంది' | i feel thrilled, says Sampoornesh Babu | Sakshi
Sakshi News home page

'త్రిపాత్రాభినయం థ్రిల్లింగ్‌గా ఉంది'

Published Sun, Aug 3 2014 11:24 AM | Last Updated on Sat, Aug 11 2018 8:27 PM

'త్రిపాత్రాభినయం థ్రిల్లింగ్‌గా ఉంది' - Sakshi

'త్రిపాత్రాభినయం థ్రిల్లింగ్‌గా ఉంది'

కరీంనగర్ : త్వరలో విడుదల కానున్న కొబ్బరిమట్ట సీనిమాలో త్రిపాత్రాభినయం చేయడం థ్రిల్లింగ్‌గా ఉందని ‘హృదయకాలేయం’ ఫేం హీరో సంపూర్ణేష్‌బాబు అన్నారు. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్లకు చెందిన చింతోజు ఈష్‌కుమార్‌ను కలిసి వేడుకలు చేసుకోవడానికి శనివారం ఆయన కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లకు వచ్చారు. ప్రస్తుతం ఐదు సినిమాల్లో నడిస్తున్నట్లు తెలిపారు. మూడింటిలో అతిథి పాత్ర.. రెండింటిలో హీరోగా చేస్తున్నట్లు వెల్లడించారు.
 
రూపక్ దర్శకత్వంలో వస్తున్న కొబ్బరి మట్టలో తాను పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయిడు అనే విభిన్న పాత్రల్లో కనిపిస్తానని తెలిపారు. మొదట సినిమాల్లో వేషాలకోసం పడరాని పాట్లు పడ్డానని, ఎందరినుంచో విమర్శలు ఎదుర్కొన్నానని అప్పుడే విమర్శకులకు సరైన సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకుని చాలెంజ్‌గా తీసుకున్నానన్నారు. కొత్త ఆర్టిస్టులకు అవకాశం వచ్చేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. స్నేహబంధం గొప్పదని పేర్కొంటూ..స్నేహితుల రోజు శుభాకాంక్షలు తెలిపారు. డివిజన్ స్వచ్ఛంద సంస్థల అధ్యక్షుడు చింతోజు భాస్కర్ సంపూర్ణేష్‌బాబును మెమోంటోతో సత్కరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement