కోలీవుడ్‌కి సంపూ సినిమా | sampoornesh babu kobbari matta tamil remake | Sakshi
Sakshi News home page

కోలీవుడ్‌కి సంపూ సినిమా

Oct 15 2016 10:17 AM | Updated on Sep 4 2017 5:19 PM

కోలీవుడ్‌కి సంపూ సినిమా

కోలీవుడ్‌కి సంపూ సినిమా

ఆన్‌లైన్ సెన్సెషన్‌గా వెండితెర మీదకు ఎంట్రీ ఇచ్చి, తొలి సినిమాతోనే బీభత్సమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్న స్టార్, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. హృదయకాలేయం సినిమాతో హీరోగా ఎంట్రీ...

ఆన్‌లైన్ సెన్సెషన్‌గా వెండితెర మీదకు ఎంట్రీ ఇచ్చి, తొలి సినిమాతోనే బీభత్సమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్న స్టార్, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. హృదయకాలేయం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంపూ తరువాత పలు చిత్రాల్లో అతిథి పాత్రలతోనూ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం కొబ్బరిమట్ట సినిమాలో త్రిపాత్రాభియం చేస్తున్నాడు. పాపరాయుడు, పెదరాయుడు, ఆండ్రాయిడు అనే మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తున్నాడు సంపూ.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాను తమిళ్‌లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కోలీవుడ్‌లో స్టార్ కమెడియన్ ఒకరు ఈ సినిమా రైట్స్ కోసం ట్రై చేస్తున్నారు. భారీ మొత్తం చెల్లించి రైట్స్ సొంతం చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. సంజన మూవీస్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న  ఈ సినిమాను అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో డిస్ట్రిబ్యూట్ చేయనున్నారన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు తొలిసారి సంపూర్ణేష్ సినిమాను ఓవర్‌సీస్‌లోనూ మిడ్ వెస్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా భారీగా రిలీజ్  చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement