‘కొబ్బరి మట్ట’పై కొత్త అప్‌డేట్‌ | Sampoornesh babu Kobbari Matta Movie Update | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 3 2018 3:36 PM | Last Updated on Tue, Jul 3 2018 8:13 PM

Sampoornesh babu Kobbari Matta Movie Update - Sakshi

హృదయ కాలేయం సినిమాతో సెన్సేషన్‌ సృష్టించిన సంపూర్ణేష్ బాబు తరువాత హీరోగా నటిస్తూనే సహాయ పాత్రల్లోనూ నటిస్తున్నాడు. దాదాపు ఏడాదిన్నర క్రితం సంపూర్ణేష్ బాబు హీరోగా కొబ్బరిమట్ట సినిమా ప్రారంభమైంది. అయితే వివిధ కారణాలతో ఆలస్యమైన ఈ సినిమా ఫైనల్‌గా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని హీరో సంపూర్ణేష్‌ బాబు, దర్శకుడు రాజేష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

‘ఫైనల్‌ గా సినిమా పూర్తయ్యింది. సంవత్సరమున్నర కష్టం.... కష్టం అనేది చిన్న మాట.. ఈ సినిమా నిర్మాణం కోసం రక్తం, చెమట, కన్నీళ్లు ధారాపోశాం. ఎలాంటి క్రియేటివ్ పబ్లిసిటీ చేస్తే జనం దగ్గరకి ఈ సినిమా తీసుకెళ్తాను అనేది ఇప్పుడు బుర్రలో ప్రతి క్షణం తొలుస్తున్న ఆలోచన. ప్రతి బ్యాచిలర్‌ కొంపలో మందు సిట్టింగ్ కి బెస్ట్ స్టఫ్ ‘కొబ్బరిమట్ట’ అవబోతోంది. ఒక కొత్త రకమైన, అదేదో రకమైన సినిమాని చూసి నవ్వుకోబోతున్నారు. మీ ప్రేమ, సపోర్ట్ కావాలి.  షేర్లు, లైకులు చేస్తారు. ఎందుకంటే బేసిక్ గా మీరు మంచోరు’ అంటూ ట్వీట్ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement