సంపూ సరసన ఏడుగురు హీరోయిన్లు! | Sampoo to act with Seven Herioines in Kobbari Matta | Sakshi
Sakshi News home page

సంపూ సరసన ఏడుగురు హీరోయిన్లు!

Published Wed, Apr 9 2014 11:58 AM | Last Updated on Sat, Sep 2 2017 5:48 AM

సంపూ సరసన ఏడుగురు హీరోయిన్లు!

సంపూ సరసన ఏడుగురు హీరోయిన్లు!

 'హృదయ కాలేయం' చిత్రం విడుదలకు ముందే సంపూర్ణేష్ బాబు అలియాస్ సంపూని సోషల్ మీడియా హీరో చేసింది. సోషల్ మీడియా అందించిన ఊపుతో విడుదలైన 'హృదయ కాలేయం' చిత్రం భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. హృదయ కాలేయం చిత్ర అందించిన విజయంతో నిర్మాత సాయి రాజేష్ కొబ్బరి మట్ట చిత్రాన్ని ప్రారంభించారు. 
 
హృదయ కాలేయం చిత్రం విడుదల రోజున 'కొబ్బరి మట్ట' చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. కొబ్బరి మట్ట చిత్ర ఫస్ట్ లుక్ కు మంచి స్పందనే వచ్చింది. అయితే కొబ్బరి మట్ట చిత్రాన్ని క్రేజీ ప్రాజెక్ట్ గా మలిచేందుకు నిర్మాతలు సిద్దమవుతున్నారు. సంపూ సరసన ఏడుగురు హీరోయిన్లు నటించనున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రంలో పాపారాయుడు, పెదరాయుడు, అండ్రాయుడు అనే మూడు విభిన్న పాత్రలను సంపూ పోషిస్తున్నారు. ఇన్ని ప్రత్యేకతలతో రూపొందే చిత్రం 'కొబ్బరిమట్ట' హిట్ సాధిస్తుందో లేదో చూడాలి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement