సంపూ ట్వీట్‌.. నవ్వులే నవ్వులు | Sampoornesh Tweet On Manmadhudu 2 And Kobbari Matta Movies | Sakshi

సంపూ ట్వీట్‌.. నవ్వులే నవ్వులు

Jul 27 2019 7:52 PM | Updated on Jul 27 2019 7:52 PM

Sampoornesh Tweet On Manmadhudu 2 And Kobbari Matta Movies - Sakshi

హృదయ కాలేయం సినిమాతో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌ బాబు తాజా చిత్రం కొబ్బరి మట్ట. రూపక్‌ రొనాల్డ్ దర్శకత్వంలో స్టీవెన్‌ శంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్‌ 10న విడుదల చేస్తున్నట్టు సంపూ ప్రకటించారు. ఆగస్ట్‌ 9న కింగ్‌ నాగార్జున ‘మన్మథుడు-2’విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో నాగార్జున, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, రాహుల్‌ రవీంద్రన్‌లను ట్యాగ్‌ చేస్తూ సంపూ చేసిన ట్వీట్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. 

‘మా సినిమా ఆగస్ట్‌ 10న విడుదల కాబోతుంది. నాగార్జున సర్‌, రాహుల్‌ సర్‌,  రకుల్‌ గారు, వెన్నెల కిశోర్‌ గార్ల ఆశీర్వాదాలు కావాలి. మీ సినిమా హౌస్‌ఫుల్‌ అయి, టికెట్లు దొరకక మా సినిమాకు రావాలని కోరుకుంటున్నాము. మీ సంపూర్ణేష్‌ బాబు’అంటూ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. దీనిపై నెటిజన్లు కామెడీగా స్పందిస్తున్నారు.  ఇక సంపూ ట్వీట్‌పై దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌, వెన్నెల కిశోర్‌లు తమదైన రీతిలో స్పందించారు. 

‘హహహ తథాస్తు సంపూ గారు, ఆల్‌ ద బెస్ట్‌’అంటూ రాహుల్‌ పేర్కొనగా.. ‘ఐదు వేళ్లలాంటి మనకు నాలుగు బ్రష్‌లు అవసరం లేనప్పుడు, మన రెండు సినిమాలకు ఏంటన్నా. లవ్‌ అండ్‌ కేరింగ్‌కు లవ్‌ యూ’అంటూ వెన్నెల కిశోర్‌ ట్వీట్‌ చేశాడు. ఇక ఈ సినిమా ఎపుడో విడుదల కావాల్సి ఉన్న ఫైనాల్షియల్ ప్రాబ్లెమ్స్‌తో విడుదల కాలేదు. తాజాగా ఈ సినిమా రిలీజ్‌కున్న అడ్డంకులు తొలగడంతో ఆగస్ట్‌ 10న విడుదల చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement