Silver Jewellery
-
వెండి ఆభరణాలకూ హాల్ మార్కింగ్
న్యూఢిల్లీ: బంగారం ఆభరణాలకు తప్పనిసరి హాల్ మార్కింగ్ విజయవంతం కావడంతో వెండి ఆభరణాలు, కళాకృతులకు సైతం ఈ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయడాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదనను పరిశీలించాలంటూ భారతీయ ప్రమాణాల సంస్థను (బీఐఎస్) కోరినట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ‘బంగారం మాదిరే వెండికీ హాల్ మార్కింగ్‌ను తప్పనిసరి చేయాలంటూ వినియోగదారుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. దీన్ని జాగ్రత్తగా పరిశీలించి ఒక నిర్ణయం తీసుకోండి’ అని బీఐఎస్ 78వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మంత్రి జోషి కోరారు. ఈ దిశగా కార్యాచరణను ప్రభుత్వం ఇప్పటికే మొదలు పెట్టిందని చెప్పారు. ‘అమలు సాధ్యా సాధ్యాలను పరిశీలించాలని, వినియోగదారులు, ఆభరణాల డీలర్ల స్పందనలను తెలుసుకోవాలని కోరాను. భాగస్వాములు అందరితో మాట్లాడిన తర్వాతే ప్రక్రియ మొదలు పెడతాం’అని తెలిపారు. కాగా, మూడు నుంచి ఆరు నెలల్లో వెండికి హాల్‌మార్కింగ్‌ను అమలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు బీఐఎస్ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ చెప్పారు. -
జీఆర్టీ జ్యువెలర్స్ ‘సిల్వర్ ఉత్సవ్’
హైదరాబాద్: జీఆర్టీ జ్యువెలర్స్ వెండి వస్తువులు, వెండి ఆభరణాల అతిపెద్ద కలెక్షన్లతో ‘సిల్వర్ ఉత్సవ్’ను తీసుకొచి్చంది. పూజా సామగ్రి నుంచి డిన్నర్ సెట్ల వరకూ ప్రతి శ్రేణిలో డిజైన్లను అత్యంత స్వచ్ఛత, నాణ్యతతో తీర్చిదిద్దారు.వెండి వస్తువుల తరుగుపై 25%, వెండి ఆభరణాల మీద 10% తగ్గింపు పొందవచ్చు. ‘సిల్వర్ ఉత్సవ్ ద్వారా కస్టమర్లకు ప్రశాంతమైన, మంగళకరమైన అనుభవాన్ని అందించాలని భావిస్తున్నాము. తదనుగుణంగా ప్రతి డిజైన్‌ను రూపొందించాము’ అని జీఆర్టీ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ అనంత పద్మనాభన్ అన్నారు. -
ఏదీ మీ వెనుక రాదు
‘‘నువ్వెక్కడి నుంచి వచ్చావో అదే నీ నిజమైన స్థానం. నీ ఆస్తి, నీ డబ్బు నీ వెనుక రావు’’ అంటున్నారు సంపూర్ణేష్ బాబు. ‘çహృదయ కాలేయం, కొబ్బరి మట్ట’ సినిమాలతో కామెడీ స్టార్‌గా పాపులర్ అయ్యారుఆయన. ఇటీవల పాపులర్‌గా మారిన ‘ది రియల్ మేన్’ ఛాలెంజ్ లో పాల్గొన్నారు. ఈ లాక్ డౌన్ లో ఆయన తన గతాన్ని గుర్తు చేసుకున్నారు. హీరో కాకముందు కంసాలి పని చేసేవారు సంపూ. ఈ లాక్ డౌన్ సమయంలో తన భార్య, పిల్లలకు వెండి ఆభరణాలు తయారు చేశారాయన. ఆ వీడియోను షేర్ చేసి ‘‘రాజు.. పేద తేడా లేదు. నీ ఆస్తి, డబ్బు నీ వెనుక రావు. నువ్వెక్కడి నుంచి వచ్చావో మర్చిపోకు అని నా నిజమైన స్థానం గుర్తు చేసుకుంటూ మా ఆవిడ కోసం, నా పాత ‘కంసాలి’ వృత్తిని గుర్తు చేసుకుంటూ ఇంట్లో మిగిలిన గజ్జెలతో తనకి కాలి మెట్టెలు, పిల్లల కోసం గజ్జెలు చేసి ఇచ్చాను’’ అని పేర్కొన్నారు సంపూర్ణేష్. -
‘అక్షయ’ అమ్మకాలు ఓకే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అక్షయ తృతీయకు దేశవ్యాప్తంగా స్వర్ణ ప్రియులు తమ సెంటిమెంటును కొనసాగించారు. చిన్న చిన్న ఆభరణాలను ఎక్కువగా కొనడం విశేషం. ఎన్నికల నగదు ఆంక్షలు, అధిక బంగారం ధర కారణంగా ఈ దఫా అక్షయ తృతీయకు అమ్మకాలు అంతంతగానే వుంటాయని వ్యాపారస్తులు భావించినప్పటికీ, షాపులు కళకళలాడాయి. కానీ గతేడాదితో పోలిస్తే అమ్మకాలు తక్కువగానే వున్నాయని బులియన్ వర్తకులు వివరించారు. వినియోగదారుల సౌకర్యార్థం కొన్ని దుకాణాలు ఉదయం 8 నుంచే తెరిచారు. పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో కస్టమర్లతో షాపులు కిటకిటలాడాయి. పెళ్లి కోసం ఆభరణాలను ఇప్పటికే ఆర్డరు ఇచ్చినవారు అక్షయ తృతీయ రోజు వాటిని తీసుకెళ్లారని ఆంధ్రప్రదేశ్ గోల్డ్ సిల్వర్ జువెలరీ, డైమండ్ మర్చంట్స్ అధ్యక్షుడు బి.సూర్యప్రకాశ్‌రావు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. మధ్య తరగతి కుటుంబాల వారు చిన్న ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేశారని ఆయన చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో అమ్మకాలు జోరుగా ఉన్నాయని వరల్డ్ గోల్డ్ కౌన్సి ల్ తెలిపింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా పుత్తడికి మంచి డిమాండ్ ఉంటుందని, ఇందుకు అక్షయ తృతీయ అమ్మకాలు నిదర్శనమని వెల్లడించింది. ఆఫర్లే ఆఫర్లు.. అక్షయ తృతీయ సందర్భంగా దాదాపు అన్ని దుకాణాలు పలు ఆఫర్లను ప్రకటించాయి. బహుమతిగా బంగారు నాణేలను సైతం అందించాయి. వజ్రాభరణాలు, వజ్రాలపై భారీ తగ్గింపుతోపాటు బంగారు ఆభరణాల తయారీ వ్యయంపై డిస్కౌంట్ వంటి ఆఫర్లు అమ్మకాలు పెరిగేందుకు దోహదం చేసింది. కొన్ని నెలలుగా బంగారం అమ్మకాలు లేక దుకాణాలు బోసిగా దర్శనమిచ్చాయి. అక్షయ తృతీయ రాకతో ఒక్కసారిగా కళకళలాడాయని ఆర్ఎస్ బ్రదర్స్ అమీర్‌పేట్ షోరూం జువెలరీ విభాగం మేనేజర్ నాగ కిరణ్ చెప్పారు. తమ అంచనాలకు తగ్గట్టుగా అమ్మకాలు ఉన్నాయని ఆల్ ఇండియా జెమ్స్ జువెలరీ ట్రేడ్ ఫెడరేషన్(జీజేఎఫ్) డెరైక్టర్ మోహన్‌లాల్ జైన్ తెలిపారు. అక్షయ తృతీయ కోసం సుమారు 40-50 టన్నుల బంగారం ఏప్రిల్‌లో భారత్‌కు దిగుమతి అయి ఉంటుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా. గతేడాది ఇది 200 టన్నులున్నట్టు సమాచారం. శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో మేలిమి బంగారం ధర 10 గ్రాములకు రూ.30 వేలుంది. ఆభరణాల అమ్మకాలు పెంచుకునేందుకు ఈసారి బంగారం వర్తకులు హోం డెలివరీ సేవలను విస్తృతంగా అందిస్తున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లడం సమస్యగా పరిణమించడమే ఇందుకు ప్రధాన కారణం. మరోవైపు క్రెడిట్, డెబిట్ కార్డులతో చెల్లింపులు పెద్ద ఎత్తున పెరిగాయి. అక్షయ తృతీయ సందర్భంగా పుత్తడి కొనుగోళ్లు మరో రెండురోజులు కొనసాగుతాయని వ్యాపారులు తెలిపారు.