సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ముఖ్యం
డెరైక్టర్ భీమ్‌సింగ్, ఆయన పిల్లలు కణ్ణన్, లోక్‌సింగ్ (ఛాయాగ్రాహకులు) మాకు చుట్టాలు. డిగ్రీ అయిపోయాక ఏం చేయాలని అయోమయంలో ఉన్నప్పుడు నాన్నగారు ఛాయాగ్రాహకు రాలిగా వెళ్లమని దారి చూపారు. తెలుగులో నా మొదటి చిత్రం ‘సుబ్బు’. తెలుగు, హిందీ, తమిళం, జపనీస్, ఇంగ్లీష్ భాషల్లో 20 చిత్రాలకు పనిచేశా. ప్రస్తుతం సంపూర్ణేశ్‌బాబుతో ‘వైరస్’ చేస్తున్నా. మహిళలు ఎక్కువగా నటన, దర్శకత్వం రంగాలవైపే ఆసక్తి చూపుతున్నారు. కానీ కెమేరా రంగం వైపు రావడం లేదు. ఇక్కడికి వచ్చేవారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ముఖ్యం. ఏ రంగంలోనైనా చేసే పనిని ప్రేమిస్తే విజయం వరిస్తుంది. - విజయశ్రీ, కెమేరా ఉమన్ (‘సుబ్బు’ ఫేమ్)