![Hyderabad Rains : Sampurnesh Babu Donates 50,000 Cheque - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/21/966.jpg.webp?itok=nT43DEDk)
సాక్షి, సిద్ధిపేట : గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరబాద్ నగరం అతలాకుతలం అయింది. పలు కాలనీలు ఇంకా జలదిగ్భంధంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వరద బాధితులకు తన వంతు సహాయంగా సినీ నటుడు సంపూర్ణేష్ బాబు 50వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కి అందజేశాడు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావుకు సంబంధిత చెక్కును అందించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. అకాల వర్షాల కారణంగా హైదరాబాద్ ప్రజలు ఎంతో నష్టపోయారని వారికి తన వంతు సహాయం అందించానని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు సంపూర్ణేష్ బాబును అభినందించారు.సిద్దిపేట బిడ్డగా, సినీ ఆర్టిస్టుగా మానవత్వం చాటుకున్నారని ప్రశంసించారు. (హైదరాబాద్ వరదలు : ప్రభాస్ భారీ విరాళం )
గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు కాలనీలు నీట మునిగాయి. ఈ భారీ వర్షాల కారణంగా నగరవాసులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వందల్లో కాలనీలు జలదిగ్బంధం కావడంతో ప్రజలు భయట అడుగు పెట్టలేని పరిస్థితి నేలకొంది. వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయం కింద రూ. 550 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్‌టీఆర్, విజయ్ దేవరకొండ ప్రభాస్ సహా పలువురు ప్రముఖులు సీఎం రిలీఫ్ ఫండ్‌కి భారీ విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. (హైదరాబాద్ వరదలు: నాగార్జున విరాళం)
Comments
Please login to add a commentAdd a comment