అగర్తలా: త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 1,100 గ్రామాలలో మార్కెట్లలో డస్ట్‌బిన్‌లను ఏర్పాటు చేసినందుకు తన ఆరు నెలల జీతాన్ని విరాళంగా ఇస్తానని ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా చెత్త, ప్లాస్టిక్ రహిత త్రిపుర కోసం ప్రచారం ప్రారంభించాలని అన్ని గ్రామ ప్రధాన్లను కోరినట్లు దేబ్ చెప్పారు.
సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లోని బీజేపీ యూనిట్లు సెప్టెంబర్ 14 నుండి వారం రోజుల పాటు 'సేవా సప్తాహ్' లేదా సర్వీస్ వీక్ నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 1,100 గ్రామాలలోని మార్కెట్లలో డస్ట్‌బిన్‌లను ఏర్పాటు చేసినందుకు తన ఆరు నెలల జీతం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నానని త్రిపుర సీఎం వెల్లడించారు. అలాగే 'సేవా సప్తాహ్'లో భాగంగా పార్టీ కార్యకర్తలు రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలలో రక్తదానం, ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా అయిన దేవ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment