
తెలుగులో ఎప్పటికప్పుడు హీరోయిన్లు వస్తూనే ఉంటారు. అలా ప్రస్తుతం ట్రెంటింగ్ హీరోయిన్ మీనాక్షి

అలాంటి మీనాక్షి చౌదరి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు

హర్యానాలో ఈమె పుట్టింది. తండ్రి ఆర్మీలో కల్నల్ గా పనిచేసి వీరమరణం పొందారు

డెంటల్ కోర్స్ పూర్తి చేసిన మీనాక్షి.. చదువంతా ఆర్మీ స్కూల్స్ లోనే పూర్తిచేసింది

స్టేట్ లెవల్ స్విమ్మర్, బ్యాడ్మింటర్ ప్లేయర్ అయిన ఈమె ఇప్పుడు నటిగానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది

2018లో మిస్ హర్యానాగా నిలిచిన మీనాక్షి.. మిస్ ఇండియా పోటీల్లో రన్నరప్

మీనాక్షి పలు వర్క్ షాప్స్ లో పాల్గొనేది. అక్కడే ఈమెని తెలుగు హీరో సుశాంత్ చూశాడు. అలా వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది

ఈ క్రమంలోనే సుశాంత్ తన సినిమా 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' కోసం మీనాక్షిని హీరోయిన్ గా తీసుకున్నాడు. తెలుగులో మూవీ చేయడానికి ముందు హిందీలో అప్ స్టార్స్ అనే సినిమా, ఔట్ ఆఫ్ లవ్ అనే సిరీస్ లో మీనాక్షి నటించింది

గతేడాది మీనాక్షి నటించి ఆరు సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో లక్కీ భాస్కర్, ద గోట్, గుంటూరు కారం ఉన్నాయి. రీసెంట్ గా పండక్కి రిలీజైన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ మూవీ రూ.300 కోట్ల వసూళ్లు సాధించింది

అందరూ అనుకుంటున్నట్లు ఈమె పేరు మీనాక్షి చౌదరి కాదు.. మీనాక్షి చౌధురి.. కాకపోతే వాడుక భాషలో చౌదరి అని పిలిచేస్తున్నారు!




