ప్రధాని మోదీ బర్త్‌డే వేడుకలు: భారీ కేక్స్‌, ఆకట్టుకునే సైకత శిల్పం | PM Modi birthday: BJP workers and others celebrations | Sakshi
Sakshi News home page

PM Modi birthday: ఘనంగా వేడుకలు: భారీ కేక్స్‌, సైకత శిల్పం

Published Fri, Sep 17 2021 2:08 PM | Last Updated on Fri, Sep 17 2021 2:39 PM

PM Modi birthday: BJP workers and others celebrations - Sakshi

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ 71వ పుట్టిన రోజు సందర్భంగా పలువురు కేంద్రమంత్రులు,ఇతర రాజకీయ ప్రముఖులు విషెస్‌ అందిస్తున్నారు.

సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 71వ పుట్టిన రోజు సందర్భంగా పలువురు కేంద్రమంత్రులు, ఇతర రాజకీయ ప్రముఖులు విషెస్‌ అందిస్తున్నారు. అలాగే సినీ, క్రీడారంగ దిగ్గజాలు కూడా మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు దీంతో సోషల్‌మీడియాలో భారీ సందడి నెలకొంది.

ముఖ్యంగా దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు మోదీబర్త్‌డే  వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో సిరంజి ఆకారంలో ఉన్న  71 అడుగుల పొడవైన కేక్‌ను కట్ చేసి ప్రధానికి విషెస్‌ తెలిపారు. భోపాల్‌లో 71 అడుగుల కేక్‌ కట్‌ చేశారు. అలాగే  71 మంది బీజేపీ కార్యకర్తలు, రక్తదానం చేయనున్నారు. మోదీ పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో  సెప్టెంబర్ 16 న నిర్వహించారు మట్టి దీపాలు వెలిగించి 71 కిలోల లడ్డూతో వేడుకలు నిర్వహించారు.  ఈ సందర్భంగా 'కాశీ సంకల్ప్' పుస్తకాన్ని లాంచ్‌ చేశారు.

చదవండి:  Ola Electric : రెండు రోజుల్లో  రూ. 1100 కోట్లు

మరోవైపు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ బీచ్  ఒడ్డున ప్రధాని సైకత శిల్పాన్ని రూపొందించారు. మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన పట్నాయక్‌ సముద్ర గవ్వలతో స్పెషల్‌గా రూపొందించిన ఈ సైకత శిల‍్పం ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. గౌరవ ప్రధాని మోదీజీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మహాప్రభు జగన్నాథ స్వామి దీవెనలు ఎప్పటికీ ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలంటూ   మోదీకి ఆయన బర్త్ డే విషెస్ చెప్పారు.

ఒడిశా కళాకారిణి ప్రియాంక సహానీ ప్రదాని పుట్టినరోజున తృణ ధాన్యాలతో మోదీ చిత్రాన్ని రూపొందించారు. 8 అడుగుల x 4 అడుగులతో అపురూపమైన కళాఖండాన్ని  తయారు చేశారు. ఇందుకోసం 25 గంటలు పట్టిందని ఆమె తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement