Sudarsan Pattnaik
-
అతిపెద్ద హాకీ స్టిక్ సైకత శిల్పంగా ప్రపంచ రికార్డు
దేశంలో పురుషుల హాకీ ప్రపంచకప్ జరుగుతున్నందున ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ అతిపెద్ద సైకత శిల్పాన్ని రూపొందించారు. ఈ మేరకు ఆయన అతి పెద్ధ హాకీ స్టిక్ రూపంలో సైకత శిల్పాన్ని రూపొందించారు. దీన్ని లాభాప్రేక్షలేని సంస్థ వరల్డ్ రికార్డ్స్ ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద సైకత హాకీ స్టిక్‌గా గుర్తించింది. ఒడిశాలో కటక్‌లోని మహానది ఒడ్డున సుమారు 5 వేల హాకీ బంతులతో 105 అడుగుల పొడవైన సైకత శిల్పాన్ని పట్నాయక్ రూపొందించారు. ఈ క్రమంలో పట్నాయక్ మాట్లాడుతూ..వరల్డ్ రికార్డ్స్ ఆఫ్ ఇండియా నుంచి ఈ సర్టిఫికేట్ పొందడం చాలా సంతోషంగా ఉంది. (చదవండి: ప్రయాణికుడు చేసిన తప్పిదం..విమానం టేకాఫ్‌కు ముందే..) -
ప్రధాని మోదీ బర్త్‌డే వేడుకలు: భారీ కేక్స్, ఆకట్టుకునే సైకత శిల్పం
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 71వ పుట్టిన రోజు సందర్భంగా పలువురు కేంద్రమంత్రులు, ఇతర రాజకీయ ప్రముఖులు విషెస్ అందిస్తున్నారు. అలాగే సినీ, క్రీడారంగ దిగ్గజాలు కూడా మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు దీంతో సోషల్‌మీడియాలో భారీ సందడి నెలకొంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు మోదీబర్త్‌డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో సిరంజి ఆకారంలో ఉన్న 71 అడుగుల పొడవైన కేక్‌ను కట్ చేసి ప్రధానికి విషెస్ తెలిపారు. భోపాల్‌లో 71 అడుగుల కేక్ కట్ చేశారు. అలాగే 71 మంది బీజేపీ కార్యకర్తలు, రక్తదానం చేయనున్నారు. మోదీ పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో సెప్టెంబర్ 16 న నిర్వహించారు మట్టి దీపాలు వెలిగించి 71 కిలోల లడ్డూతో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా 'కాశీ సంకల్ప్' పుస్తకాన్ని లాంచ్ చేశారు. చదవండి: Ola Electric : రెండు రోజుల్లో రూ. 1100 కోట్లు మరోవైపు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ బీచ్ ఒడ్డున ప్రధాని సైకత శిల్పాన్ని రూపొందించారు. మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన పట్నాయక్ సముద్ర గవ్వలతో స్పెషల్‌గా రూపొందించిన ఈ సైకత శిల్పం ఫొటోను ట్విటర్లో షేర్ చేశారు. గౌరవ ప్రధాని మోదీజీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మహాప్రభు జగన్నాథ స్వామి దీవెనలు ఎప్పటికీ ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలంటూ మోదీకి ఆయన బర్త్ డే విషెస్ చెప్పారు. ఒడిశా కళాకారిణి ప్రియాంక సహానీ ప్రదాని పుట్టినరోజున తృణ ధాన్యాలతో మోదీ చిత్రాన్ని రూపొందించారు. 8 అడుగుల x 4 అడుగులతో అపురూపమైన కళాఖండాన్ని తయారు చేశారు. ఇందుకోసం 25 గంటలు పట్టిందని ఆమె తెలిపారు. Wishing Our Hon’ble Prime Minister @narendramodi ji on his birthday. May Mahaprabhu Jagannatha bless him with long and healthy life to serve mother India. I’ve created a SandArt installation used 2035 sea shells with message #HappyBirthdayModiJi at Puri beach , Odisha . pic.twitter.com/uDTJGOLCFk — Sudarsan Pattnaik (@sudarsansand) September 17, 2021 Birthday wishes to our Honourable Prime Minister @narendramodi ji. May the Almighty shower you with good health, happiness and success throughout your journey. @PMOIndia #HappyBdayModiji pic.twitter.com/ABdFCMt87q — Mohanlal (@Mohanlal) September 17, 2021 -
పూరి తీరంలో సైకత అద్భుతం!
సాక్షి, న్యూఢిల్లీ : బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ భువనేశ్వర్‌లోని పూరి తీరంలో ఇసుకతో బుద్ధుని ప్రతిమను తయారు చేశారు. ‘ప్రపంచ శాంతిని కోరుతూ బోది చెట్టు కింద ప్రార్థన చేస్తున్న బుద్ధుడు’ సైకత శిల్పం ఫోటోలను పట్నాయక్ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. బుద్ధుని ఆశిస్సులతో ప్రపంచమంతా శాంతితో నిండిపోవాలని కాంక్షించారు. ‘అందరికీ హృదయపూర్వక బుద్ధపూర్ణిమ శుభాకాంక్షలు’ అంటూ పట్నాయక్ బుద్ధ జయంతి సందర్భంగా గతంలో బెర్లిన్, జపాన్ సముద్ర తీరాల్లో తయారు చేసిన బుద్ధుని మంచు ప్రతిమ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వైశాఖ పూర్ణిమ రోజున జన్మించిన సిద్ధార్థుడు తన బోధనలతో, చేతలతో.. మనిషి దుఃఖానికి కారణమైన కోరికలను త్యజించి శాంతియుత జీవనాన్ని గడపాలని చాటిచెప్పారు. కాగా, బుద్ధుని జన్మదినం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా బౌద్ధ మతస్తులు ప్రార్థనలు, పూజలు నిర్వహించారు. My heartiest wish to all a Blessed and Peaceful life on #BuddhaPurnima. One of my SandArts pic.twitter.com/jFSDVhJl4Q — Sudarsan Pattnaik (@sudarsansand) April 30, 2018 #BuddhaPurnima : "Bring Peace to all". Wishing Everyone Blessed & peaceful life. One of my SandArts at Berlin in 2013 . pic.twitter.com/k6UDJsn2c6 — Sudarsan Pattnaik (@sudarsansand) April 30, 2018 #BuddhaPurnima : "Bring Peace to all". Wishing Everyone Blessed & peaceful life. One of my Snow sculpture at Japan in 2007 . pic.twitter.com/JxtDKJWqvj — Sudarsan Pattnaik (@sudarsansand) April 30, 2018 -
ప్రపంచంలో ఎత్తైన 'శాంటాక్లాజ్' సైకత శిల్పం
పూరి: క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ప్రఖ్యాత భారతీయ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ బీచ్‌లో 45 అడుగుల ఎత్తు ఉన్న శాంటాక్లాజ్ సైకతశిల్పాన్ని గురువారం ఏర్పాటుచేశారు. 'ప్రపంచశాంతి' అనే సందేశంతో శాంటాక్లాజ్‌ను రూపొందించి అందరి దృష్టినీ ఆకర్షించారు. దాంతో ఆయన రూపొందించిన ఈ సైకత శిల్పం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద శాంటాశిల్పంగా గుర్తింపుపొందనుంది. ఈ శిల్పాన్ని రూపొందించడానికి వేయి టన్నుల ఇసుకను వివిధ వర్ణాల రంగులతో ఉపయోగించినట్టు సుదర్శన్ వెల్లడించారు. ఇందుకోసం పూరిలోని ఆయన శాండ్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్లో 20మంది విద్యార్థుల సహాయంతో ఈ సైకత శిల్పాన్ని ఆవిష్కరించారు. దీన్ని సరైన ఆకృతిని రూపొందించడానికి వారికి రెండు రోజల్లో 22 గంటల పాటు సమయం పట్టింది. ఈ రోజు నుంచి జనవరి 1 వరకు శాంటా సైకిత శిల్పాన్ని ప్రదర్శించనున్నారు. అదేవిధంగా సుదర్శన్ యేసు, మేరీ మాతల సైకత శిల్పాలను కూడా రూపొందించారు. అంతేకాక తన సైకత శిల్పాలను 'లిమ్కా బుక్' రికార్డ్స్‌లో చేర్చాల్సిందిగా వారిని పట్నాయక్ కోరారు. -
పూరి తీరంలో ప్రపంచంలో అతిపెద్ద జీసస్ విగ్రహం
ఒడిశాకు చెందిన ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ మరో అద్భుతం సృష్టించారు. క్రిస్మస్ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద జీసస్ ప్రతిమను రూపొందించారు. పూరి తీరంలో 35x75 అడుగుల ఎత్తులో విగ్రహాన్ని తయారు చేశారు. ఇందుకోసం వెయ్యి టన్నుల రంగుల మిశ్రమంతో కూడిన ఇసుకను వాడారు. పట్నాయక్ 25 మంది శిష్యులతో కలసి మూడు రోజుల్లో తయారు చేశారు. జీసస్ తో పాటు మేరీ మాత, శాంతా క్లాజ్ తో కూడిన విగ్రహం అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ నెల 24 నుంచి జనవరి 1 వరకు జీసస్ ప్రతిమను భక్తుల సందర్శనార్థం ప్రదర్శించనున్నారు. జీసస్ విగ్రహాన్ని సందర్శించేందుకు క్రైస్తవ సోదరులు అమితాసక్తి చూపుతున్నారు. పట్నాయక్ ఇంతకుముందే ఏడు ప్రపంచ రికార్డులు సృష్టించారు. తాజాగా అతిపెద్ద జీసస్ విగ్రహాన్ని గుర్తిస్తున్నట్టుగా లిమ్కా బుక్ రికార్డుల నిర్వాహకుల నుంచి ఆయనకు లేఖ అందింది.