
ముంబై: కారు ప్రమాదంపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్(28)కు ఆశ్చర్యకరమైన అనుభవం ఎదురైంది. ఏకంగా పోలీసులే అతని పుట్టిన రోజునాడు శుభాకాంక్షలు తెలిపి కేకు అందించడంతో అతను ఆనందంతో ఉబ్బితబ్బయ్యాడు. ఈ ఘటన ముంబైలోని సకినలా పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని చందీవలీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనీశ్ జైన్(28) తన కొత్త కారులో ఘట్కోపర్‌కు వెళుతుండగా ఓ టెంపో ఢీకొంది.
దీంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి టెంపో డ్రైవర్‌తో కలిసి వెళ్లిన అనీశ్..అన్ని వివరాలను అందించారు. ఫిర్యాదు నమోదైన అక్టోబర్ 14 నాడే అనిశ్ పుట్టిన రోజని గుర్తించిన అధికారులు, కేకు తీసుకొచ్చి వేడుకలు జరపాలని నిర్ణయించుకున్నారు. అనంతరం కేకు తీసుకొచ్చి ఘనంగా అనీశ్ పుట్టిన రోజు వేడుకలు నిర్వ హించారు. ఈ విషయమై అనీశ్ స్పందిస్తూ..‘ ఆ రోజు ఫిర్యాదు చేశాక కొద్దిసేపు ఆగమని పోలీసులు సూచించారు. నా పుట్టిన రోజు కావడంతో ఆలస్యమవుతున్న కొద్దీ అసహనానికి లోనయ్యాను’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment