కుప్పంలో పోలీసుల ఆంక్షలు
సాక్షి, కుప్పం: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలపై చిత్తూరు జిల్లా కుప్పంలో పోలీసు శాఖ ఆంక్షలు విధించింది. కుప్పంలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకల నిర్వహణకు అనుమతివ్వాలంటూ వైఎస్సార్‌సీపీ నేతలు ముందస్తుగా పోలీసులకు వినతిపత్రం అందజేశారు.
ఈ క్రమంలో.. వినతి పత్రంపై కుప్పం డీఎస్పీ అభ్యంతరం వ్యక్తంచేస్తూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ భరత్ పీఏ మురుగేష్‌కు లేఖను అందజేశారు. సీఎం చంద్రబాబు భార్య భువనేశ్వరి ఈ నెల 19 నుంచి 22 వరకు కుప్పంలో పర్యటిస్తున్నారని, ఆ సమయంలో ప్రతిపక్ష పార్టీ సంబరాలు చేయకూడదని లేఖలో పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో వైఎస్ జగన్ జన్మదిన సంబరాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment