సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అన్ని చోట్ల కేక్‌లు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. జిల్లాలోని హిందూపురంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు జననేత సీఎం జగన్‌పై తమకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. నగరంలో ఏర్పాటు చేసిన సీఎం వైఎస్ జగన్ కటౌట్‌పై హెలికాప్టర్ ద్వారా పులవర్షం కరిపించారు. హిందూపురం పార్లమెంట్ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు నవీన్ నిశ్చల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.