
ప్రస్తుతం కోలీవుడ్‌లో బోల్డ్ అండ్ బ్యూటీ ఎవరంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు వరలక్ష్మి శరత్‌కుమార్. నిజ జీవితంలోనే కాకుండా సినిమాల్లో ఈ తరహా పాత్రల్లోనే ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రారంభ దశలో కథానాయికగా నటించినా అలాంటి పాత్రలు ఈమెకు సరిపడలేదనే చెప్పాలి. కాని హీరోయిన్‌గా వరలక్ష్మి శరత్‌కుమార్‌కు పెద్దగా సక్సెస్ కాలేదు. తొలి చిత్రం పోడాపోడిలో నటుడు శింబుతో జత కట్టినా ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఆ తరువాత బాలా దర్శకత్వంలో నటించిన తార్ తప్పటై చిత్రంలో విలక్షణతో అందరినీ ఆకట్టుకున్నారు.
ఆ తరువాత ఆటోమేటిక్‌గా ప్రతినాయకి పాత్రలు తలుపు తట్టడం మొదలెట్టాయి. అలా సర్కార్ చిత్రంలో విజయ్‌ను, సండైకోళి–2 చిత్రంలో విశాల్‌ను ఢీ కొట్టి సరైన ప్రతినాయకిగా పేరు తెచ్చుకున్నారు. అలా వరలక్ష్మి శరత్‌కుమార్ పేరు టాలీవుడ్, మాలీవుడ్ అంటూ దక్షిణాది వరకు పాకింది. ఇటీవల తెలుగులో వీరసింహారెడ్డి చిత్రంలో బాలకృష్ణకు ఎదురు నిలిచారు. అలా వైవిధ్య భరిత పాత్రల్లో నటిస్తూ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు.
దీంతో వరలక్ష్మి శరత్‌కుమార్‌కు అభిమానగణం నానాటికి పెరిగిపోతోంది. ప్రస్తుతం ఈమెకు ఫాలోవర్స్ రెండు మిలియన్లు ఉన్నారంట. దీంతో ఆమె ఆనంద సాగరంలో తేలిపోతున్నారు. తన సంతోషాన్ని వ్యక్తం చేసే విధంగా ఆనంద తాండవం చేసిన ఒక వీడియోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. తనకు రెండు మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారని చెప్పడానికి ఈ విధంగా డాన్స్ చేసినట్లు పేర్కొన్నారు. ఇది తనకు ఎంతో ఉత్సాహాన్ని కలిగించిందని, ఈ విషయాన్ని మీకు తెలియచేయడం వల్ల మరింత దగ్గరైనట్టుగా భావిస్తున్నానని నటి వరలక్ష్మి శరత్‌కుమార్ అందులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment