కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ వరుస సినిమాలతో ట్రెండింగ్‌లో కొననసాగుతుంది. ఇండస్ట్రీలో ఒక ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందడమే కాకుండా అందుకు తగ్గట్లుగా.. తన మాట కూడా చాలా స్ట్రైట్‌గా ఉంటుంది. తప్పు చేస్తే ఎదుట ఉన్నది ఎంతటివారైనా సరే ముక్కు సూటిగా హెచ్చరిస్తుంది. తాజాగా ఆమె నటించిన లేడీ ఓరియెంటేడ్ సినిమా 'శబరి' మే 3న విడుదల కానుంది.
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా తన గతంలో జరిగిన ఒక సంఘటన గురించి పంచుకుంది. 'ఒక అమ్మాయి ఇండస్ట్రీలో రాణించడం అంత సులభం కాదు. నాన్నకు ఇష్టం లేకున్నా నేను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. నేను హీరోయిన్‌గా పేరుపొందుతున్న రోజుల్లో తమళనాడుకు చెందిన ఒక టీవీ ఛానల్ అధినేత నా ఇంటికి వచ్చాడు. ఒక ప్రాజెక్ట్‌లో నటించాలని కోరాడు.. అందుకు నేను కూడా ఒప్పుకున్నాను. కానీ, కొంత సమయం తర్వాత మనం మళ్లీ బయట కలుద్దామా..? అన్నాడు. ఎందుకు సార్ అని నేను అడిగిన వెంటనే.. ఏదైనా మాట్లాడుకుందాం రూమ్ బుక్ చేస్తాను కలుద్దాం అన్నాడు.
ఒక స్టార్ హీరో కుటుంబానికి చెందిన నన్నే ఇలా అడిగితే మిగతా అమ్మాయిల పరిస్థితి ఏంటి అని అతని మీద కేసు పెట్టాను. ఈ సంఘటన సుమారు ఆరేళ్ల క్రితం జరిగింది. ఇలాంటి వ్యక్తుల ఆటకట్టించాలని నేను 'సేవ్ శక్తి ఫౌండేషన్' స్థాపించాను.' అని ఆమె చెప్పింది.
స్టార్ హీరో కూతురిని అయనంత మాత్రాన నాకు అవకాశాలు రాలేదు.. నన్ను కూడా చాలా సినిమాల్లో నుంచి తొలగించారు. కొంతమంది కమిట్‌మెంట్ అడగడం వల్ల చాలా సినిమాలను వదులుకోవాల్సి కూడా వచ్చిందని వరలక్ష్మీ తెలిపింది. సేవ్ శక్తి ఫౌండేషన్ ద్వారా చాలామంది ఆడబిడ్డలను రక్షించామని ఆమె చెప్పింది. ఎలాంటి ఆపద అయినా సరే తమ ఫౌండేషన్‌లోకి వచ్చి సాయం అడిగితే తప్పకుండా జరుగుతుందని ఆమె పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment